Advertisement
నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ చైతన్య పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షం లోనే ఈ జంట ఒకటయ్యారు. అయితే వీళ్ళు తాజాగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట విడిపోవడంతో ఇండస్ట్రీ లో ఈ విషయం సంచలనంగా మారింది. ఈ వార్తతో మెగా ఫ్యామిలీ లో మెగా ఆడపడుచులకి పెళ్లిళ్లు కలిసి రావా అనే సందేహం కూడా చాలా మందిలో కలిగింది.
Advertisement
అటు చిరు కూతుళ్లు ఇద్దరికీ కూడా పెళ్లిళ్లు కలిసి రాలేదు. ఇప్పుడేమో నిహారిక. అయితే మరో విషయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నిహారిక కి చైతన్య తో డిసెంబర్ 20, 2020లో పెళ్లి జరిగింది. పెళ్లయి మూడేళ్లు అవ్వలేదు. పెళ్లయిన మూడు సంవత్సరాలకే మనస్పర్ధలు కారణంగా వీళ్ళు విడాకులు తీసుకున్నారు.
Advertisement
నిహారిక పెళ్లి టైం లో కుటుంబ సభ్యులు కట్న కానుకలను భారీగా ఇచ్చారట. డబ్బు రూపంలో కాకుండా భారీగా ఆస్తులు చైతన్య కి ఇచ్చారు అని తెలుస్తోంది. చిరంజీవి ఏకంగా రెండు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని ఇచ్చారు. నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గిఫ్ట్ కింద ఇచ్చారు అటు పవన్ కళ్యాణ్ కూడా ఖరీదైన కారు ని గిఫ్ట్ గా ఇచ్చారు. అలానే నాగబాబు కూడా బాగా భారీ గానే ఆస్తులని ఇచ్చారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
Also read: