Advertisement
దోమకాటు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది కాటు వేసింది అంటే ఎంతటివారైనా అనారోగ్య సమస్యల్లో పడాల్సిందే. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు వస్తాయి. మరి ఇలాంటి దోమలు ఎక్కువగా మన తలపైనే గుంపులుగా తిరగడం మీరు ఎప్పుడైనా గమనించారా.. దానికి కారణం ఏంటో ఒకసారి చూడండి..?
మన శరీరంలో వేడి మరియు కొలెస్ట్రాల్ ఎక్కువ అయినప్పుడు దోమలు ఆ విధంగా తిరుగుతాయి.
Advertisement
అంతేకాకుండా శరీరం నుంచి చెమట మరియు ఇతర వాసన వల్ల కూడా దోమలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా తల పైన ఎందుకు తిరుగుతాయి అని మీకు డౌట్ రావచ్చు.. అయితే మన శరీరంలో ఉన్నటువంటి వేడి ఎక్కువగా తల భాగం నుంచి బయటకు వస్తుంది. అందుకే అవి కళ్ళ పైన తిరుగుతాయి. అయితే దోమలు”O” బ్లడ్ గ్రూపు ఉన్నవారిని ఎక్కువగా కుడతాయి.
Advertisement
“A” బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని తక్కువగా కుడతాయట. ఇంకా దోమ గురించి తెలుసుకోవాలంటే ఇందులో ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. ఎందుకంటే అవి గుడ్లు ఉత్పత్తి చేయడం కోసం కావాల్సిన ప్రోటీన్లు మనిషి రక్తంలో మాత్రమే లభిస్తాయి కాబట్టి. అలాగే మగ దోమలు చెట్ల ఆకులు, బెరడు వంటివాటిలో రసాన్ని పీల్చుకొని జీవిస్తాయి.. ఎక్కువగా ముదురు రంగు దుస్తులు వేసుకున్న వారిని కుడతాయి.