Advertisement
సోషల్ మీడియా వాడకం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో మనకి కనబడుతూ ఉంటాయి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమా కాదా అనేది తెలుసుకోవడం కూడా ఈ రోజుల్లో బాగా కష్టమైపోయింది. సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సెలబ్రిటీల గురించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూమర్లు సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు చాలామంది రూమర్లని నిజమని భావించి నమ్మేస్తూ ఉంటారు.
Advertisement
స్వయంగా ఆ విషయం నిజమా కాదా అని ఎవరికి వాళ్ళు చెప్తే కానీ అది నిజమా కాదో మనకి తెలియదు. తాజాగా రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ ఐశ్వర్య గత సంవత్సరం విడిపోతున్నట్లు ప్రకటించారు. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేశారు. తర్వాత కొన్ని రోజులకి విడాకులు రద్దు చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి దీని మీద ధనుష్ కానీ ఐశ్వర్య కానీ స్పందించలేదు.
Advertisement
అయితే ఇప్పుడు ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి కారణం ఈ మధ్య తమిళ హీరోతో ఆమె ఎక్కువగా కనబడుతోంది. చెన్నైలోనే ఒక రిసార్ట్ లో ఆ హీరోతో ఐశ్వర్య సన్నిహితంగా ఉండడంతో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐశ్వర్య ధనుష్ ఎందుకు విడిపోయారు అనే దానికి కూడా కారణం మనకి తెలియదు.
సుచి లీక్స్ లో ధనుష్ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు నుండి వీళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి అని ప్రచారం అయితే సాగింది. ఒక హీరోయిన్ తో ధనుష్ క్లోజ్ గా ఉండడం ఐశ్వర్య కి నచ్చలేదని.. అందుకే విడాకులు తీసుకున్నారని కూడా టాక్ అయితే వచ్చింది. ఐశ్వర్య రజనీకాంత్ మాత్రం రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ ఇదంతా ఫాల్స్ న్యూస్ అని చెప్పారు.
Also read: