Advertisement
ప్రతి ఒక్క భార్యాభర్త కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటుంటారు. భార్య, భర్త కలకాలం కలిసి ఆనందంగా జీవించాలని అనుకుంటారు. అలానే ప్రతీ ఒక్కరు కూడా కుటుంబం, ఆరోగ్యం, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. కానీ ఈ రోజుల్లో అనేక మార్పులు వచ్చాయి. అనేక పద్ధతులు వచ్చాయి. దాంతో చాలామంది సంతోషంగా ఉండడం లేదు. ఆనందాన్ని కోల్పోతున్నారు.
Advertisement
డబ్బుతో సుఖం వస్తుంది కానీ సంతోషం రాదు. అయితే డబ్బుతో సంతోషం సరదా ఉంటుంది కానీ సంతృప్తి ఉండదు. ఈరోజుల్లో భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయడం ఒకరి టైం ని మరొకరికి ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారు దాని వలన వాళ్ళ మధ్య బంధం దెబ్బతింటుంది. అలానే వాళ్ళ మధ్య గ్యాప్ అనేది వస్తుంది. బంధం పాడవుతుంది. భార్యాభర్తల బంధం మధ్య కొంచెం గ్యాప్ రావడంతో భార్యాభర్తల మధ్య సమస్యలు కూడా వస్తున్నాయి.
ప్రతి భార్య కూడా భర్త ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కాసేపు తనతో సమయాన్ని గడపాలని కోరుకుంటుంది. భర్తతో రోజులో జరిగే విషయాలు చెప్పడం కాసేపు కబుర్లు చెప్పుకోవడం.. కష్టసుఖాలు మాట్లాడుకోవాలని ప్రతి భార్య కూడా అనుకుంటుంది. ఉదయం నుండి పిల్లలు కూడా నాన్న ఎప్పుడు వస్తారు అని చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు కచ్చితంగా ఆ వ్యక్తి సమయాన్ని ఇవ్వాలి. కుటుంబం కోసం కాసేపు సమయాన్ని ఇస్తే ఖచ్చితంగా ఆనందంగా ఉండొచ్చు.
Advertisement
అంతేకానీ సమయాన్ని ఇవ్వకుండా కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న రేస్ లో సమయం ఇవ్వడం మర్చిపోతే భార్య పిల్లలకి కూడా కష్టంగా ఉంటుంది. పిల్లలతో ఖచ్చితంగా కాస్త నాణ్యమైన సమయాన్ని గడపాలి ప్రతి తండ్రి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భర్త టైం ఇవ్వకపోతే భార్య ఏమీ తోచక ఎక్కువ షాపింగ్ చేయడం డబ్బులు అతిగా ఖర్చు చేయడం వంటివి చేస్తూ ఉంటుంది.
అదేవిధంగా భర్త టైం ఇవ్వకపోతే భార్య ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను అని బాధపడుతూ ఉంటుంది కాబట్టి కచ్చితంగా భర్త తన సమయాన్ని భార్యకి ఇవ్వాలి. పైగా భర్త టైం ఇవ్వకపోతే భార్య మరొకరితో సంబంధం పెట్టుకోవడం తన భర్త తో విడిపోవాలని అనుకోవడం ఇలా ఎన్నో నష్టాలుంటాయి.
Also read: