Advertisement
సాయి రాజేష్ నీలం ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన తదితరులు ఈ సినిమాలో నటించారు. ఎస్.కె.ఎన్ ఈ సినిమాని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు.
Advertisement
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన తదితరులు
దర్శకుడు : సాయి రాజేష్ నీలం
నిర్మాత : ఎస్.కె.ఎన్
సంగీతం : విజయ్ బుల్గానిన్
విడుదల తేదీ: 14-07 -2023
కథ మరియు వివరణ:
వైష్ణవి (వైష్ణవి చైతన్య) ఒక బస్తీలో వుండే అమ్మాయి. స్కూల్ ఫ్రెండ్ అలానే ఎదిరింట్లో ఉండే అబ్బాయి ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ని లవ్ చేస్తుంది. ఆనంద్ కొన్నేళ్ళకి 10వ తరగతి ఫెయిల్ అయిపోతాడు. ఆటో నడుపుకుంటూ ఉంటాడు. వైష్ణవి టెన్త్ అయ్యాక ఇంటర్ చదువుతుంది. బీటెక్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంది. బీటెక్ లో జాయిన్ అయ్యాక…ఆమెకు విరాజ్ (విరాజ్ అశ్విన్) తో పరిచయం మొదలు అవుతుంది. అతని వల్లే వైష్ణవి పాష్ గా మారుతుంది.
Advertisement
ప్రేమికుడు అయిన ఆనంద్ ని కూడా దూరం పెట్టేస్తుంది. విరాజ్ వైష్ణవి కోసం ప్లాన్ వేసి పడక సుఖం తీర్చుకుని ఎలా అయినా వదిలించేసుకోవాలనుకుంటాడు. మరి అతని ప్లాన్ ఎంత దాకా వర్క్ అవుట్ అయింది..? మరి ఆనంద్ వైష్ణవి లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
వైష్ణవి నటన బాగుంది. అలానే ఇతర నటులు కూడా బాగా నటించారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సన్నివేశాలతో సినిమాని తీశారు. నేపథ్య సంగీతం బాగుంది. ఎమ్ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. బలమైన ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ ని మాత్రం బాగా సాగదీశారు.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
ఎమోషన్స్
సంగీతం
నిర్మాణ విలువలు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
సాగదీత సన్నివేశాలు
కొన్ని సీన్స్
రేటింగ్ : 2.75/5
Also read: