Advertisement
పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు కలిసి ఆనందంగా జీవించాలని అనుకుంటుంటారు. ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా ఒకరికొకరు తోడు, నీడై ఉండాలని అనుకుంటారు కానీ అనుకున్నవన్నీ కూడా కొన్ని కొన్ని సార్లు జరగవు. ఏదో కారణం ఏదో ఇబ్బంది రావడం దాంతో ఆఖరికి జీవితాన్ని కోల్పోవడం వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు కారణంగా కూడా చాలా మంది ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. భర్తకి చాలా తక్కువ జీతం రావడం, అప్పులు, భార్యని సంతోషంగా ఉంచలేకపోవడం వంటి వాటి వల్ల తరచూ ఈ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉండేవి.
Advertisement
మనస్పర్ధలు ఎక్కువయ్యి ఆఖరికి ప్రాణాలని తీసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా, వెంకటగిరి రూరల్ మండలం, కలవపాడు గ్రామ శివారులో ఇది చోటు చేసుకుంది. మహేశ్వరి భర్త తిరుపాలయ్య. మహేశ్వరి తిరుపాలయ్యకి పవన్, కార్తీక్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరు లేనప్పుడు కాళ్ల పట్టిలు తీసి ఇంట్లో పెట్టేసి రాపూర్ కు వెళ్లి బస్సు ఎక్కింది. డక్కిలి మండలం పలుగోడుకు ఈమె ఒక టికెట్ తీసుకుంది.
Advertisement
కానీ ఈమె కలపాడు తెలుగు గంగ కాలువ వచ్చేసరికి బస్సు దిగేసింది. గ్రామానికి వెళ్లే కట్టమీదుగా నడుచుకుంటూ వెళ్ళింది. ఇంట్లో లేకపోవడం తో భర్త ఆమెకు ఫోన్ చేసాడు. ఫోన్ చెయ్యగానే ముందు ఆమె ఎత్తలేదు. కానీ ఆమె తిరిగి భర్తకు ఫోన్ చేసి వంట గది లో డబ్బాల కింద రూ. 1700 పెట్టినట్టు చెప్పింది. అలానే తన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోమంది. ఇంతలో అతను గట్టిగా ఏమైంది అని అడిగేసరికి కలపాడు వద్ద తెలుగు గంగ కాలువ లోకి దూకి చనిపోతున్నట్లు చెప్పింది. ఫోన్ చేసినా కూడా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తరవాత కాలువ లోకి ఆమె దూకేసింది. అక్కడ కి పోలీసులు చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Also read: