Advertisement
పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేయడం.. ప్రేమించి వదిలేయడం.. ఇలాంటివి చాలా చోటు చేసుకుంటున్నాయి. బాగా డబ్బులు ఉన్నవాళ్ళని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఈ మధ్య మ్యాట్రిమోనియల్ సైట్లు కూడా మోసాలకి సులభంగా మారాయి. తాజాగా మరొక సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆంధ్ర మహిళా చెన్నైకి చెందిన ఒక యువకుడితో మాట్లాడుతూ ఏకంగా లక్షల రూపాయలని కాజేసింది. పెళ్లి చేసుకుందాం అనేసరికి హ్యాండ్ చేసింది.
Advertisement
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… తమిళనాడులోని ఓ కాల్ సెంటర్లో పని చేస్తున్న అశోక్ చైతన్య పెళ్లి కోసం మ్యాట్రిమోనీ సైట్ లో పేరును ఎంటర్ చేసుకున్నాడు. మదనపల్లె కి చెందిన శ్రావణి సంధ్యతో పరిచయం ఏర్పడింది. బెంగళూరులో ఆమె ఉంటుంది. తన ఫోటోలని పంపకుండా శ్రావణి అందమైన మోడల్ ఫోటోలని పంపించింది. ఇక ఆమెను చూసి ఫ్లాట్ అయిపోయాడు అశోక్. ఆమె ప్రేమలో పూర్తిగా పడిపోయాడు. ఆమెతో బాగా చాట్ చేసేవాడు.
Advertisement
ఇక సంధ్య టైం చూసుకుని డబ్బులు ని కాజేయడం మొదలుపెట్టింది. ఏకంగా తొమ్మిది లక్షల వరకు దోచేసింది. ఆమెకు ఒక విలువైన ఫోన్ ని కూడా ఈ మధ్య కొరియర్ ద్వారా పంపించాడు. ఇక ఆఖరికి పెళ్లి చేసుకుందామని అడిగాడు చైతన్య. అప్పటినుండి కూడా ఆమె ఎటువంటి రిప్లై ఇవ్వలేదు అతన్ని బ్లాక్ చేసింది. అప్పుడు చైతన్యకి మోసపోయినట్లు అర్థమైంది.
పోలీసులకి కంప్లైంట్ చేశాడు. పోలీసులు చాటింగ్ ద్వారా బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకొని ఆమెని అరెస్ట్ చేశారు. ఆమె ఇలాగే చాలా మందిని మోసం చేసినట్లు గ్రహించారు. అమాయకపు పురుషుల్ని వలలో వేసుకుని మోసం చేసి లక్షల రూపాయలని దోచుకుంటూ తర్వాత నెమ్మదిగా ఈమె వదిలించుకుంటుందని తెలిసింది. కోర్టుకి తీసుకు వెళ్లి జైలుకి తరలించారు పోలీసులు.
Also read: