Advertisement
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య బేబీ సినిమా శుక్రవారం థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందర్నీ సినిమా బాగా ఆకట్టుకుంటోంది. మొదటి షో నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఏ ఈ సినిమాకి వస్తోంది. అద్భుతమైన లవ్ స్టోరీ గా ఈ సినిమా సూపర్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే మొదట ఇటువంటి లవ్ స్టోరీ మూవీకి హీరోయిన్ గా శ్రీలీల ఉంటే బాగుంటుందని సాయి రాజేష్ అనుకున్నారు.
Advertisement
కానీ ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు తో శ్రీలీల బిజీగా ఉంది. దాంతో కథను కూడా వినకుండా ఆమె ఈ సినిమాలో నటించడానికి రిజెక్ట్ చేసింది. శ్రీలీల ఈ జనరేషన్ కి తగ్గ హీరోయిన్. పైగా ప్రస్తుతం శ్రీలీల క్రేజ్ నడుస్తోంది. కాబట్టి ఆమె ఈ సినిమాకి వర్కౌట్ అవుతుందని సాయి రాజేష్ అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోకపోవడం తో ఇంకొక హీరోయిన్ ని చూసుకోవాలనుకున్నారు. పైగా చిన్న బడ్జెట్ సినిమా కావడం వలన అంత పెద్ద హీరోయిన్ ని కాకుండా వైష్ణవి చైతన్యని హీరోయిన్ గా ఎంపిక చేశారు.
Advertisement
కానీ నిజానికి శ్రీ లీల ఈ సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకుంది. బేబీ సినిమా మంచి హిట్ అవడంతో కచ్చితంగా శ్రీలీల మిస్ చేసుకున్నందుకు బాధపడాలి అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. మంచి హిట్ మూవీని ఆమె వదిలేసుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు. టీనేజ్ ఎట్రాక్షన్, లవ్ మీద ఈ సినిమా కథని చాలా అద్భుతంగా సాయి రాజేష్ తీసుకువచ్చారు. ఏది ఏమైనా వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కి ఈ సినిమా సూపర్ హిట్ ని ఇచ్చింది.
Also read: