Advertisement
వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన బేబీ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సాయి రాజేష్ ఈ సినిమాకి ఎంతో అద్భుతంగా దర్శకత్వం వహించారు. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య నటన కూడా బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రని నెగిటివ్ గా చూపించడం జరిగింది.
Advertisement
పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాయిల్ని చెడుగా చూపిస్తే మూవీ హిట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఈ విషయంపై వివిధ రకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. కుమారి 21ఎఫ్, ఆర్ఎక్స్ 100 ఇప్పుడు బేబీ సినిమా. ఇలా ఈ సినిమాల్లో హీరోయిన్లని పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ గా చూపించడంతో సినిమాలు హిట్ అవుతున్నాయి.
Advertisement
దీంతో కొంతమంది దర్శకులు ఇలా సినిమాని తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. కొంతమంది అయితే ఇటువంటి సినిమాలు తప్పుదారి పట్టిస్తున్నాయని వారి యొక్క అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఇదివరకు అయితే హీరోయిన్లు పాత్ర పాజిటివ్ గా ఉంటే సినిమా హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు చూస్తే నెగిటివ్ గా హీరోయిన్లని చూపించాల్సిన పరిస్థితి కలిగింది.
మరి ఇక రాబోయే రోజుల్లో ఇంకెంత నెగిటివ్ గా హీరోయిన్ పాత్రని చూపిస్తారని.. అంతా అంటున్నారు. హీరోయిన్లు పాత్ర నెగిటివ్ గా చూపిస్తే బాగుంటుందని ఇప్పటికే పలు సినిమాల్లో అలా చూపించారని, అలా చూపిస్తేనే మూవీ హిట్ అవుతుందా అని ఇంకొందరు అంటున్నారు. అయితే హీరోయిన్ పాత్ర ని నెగిటివ్ గా బేబీ సినిమాలో చూపించారు. కానీ ఆ ఒక్కటే సినిమా హిట్ కి కారణం అయితే కాదు కదా..?
Also read: