Advertisement
రాజీవ్ కనకాల అందరికీ సుపరిచితమే. సీనియర్ నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడు రాజీవ్ కనకాల. సీరియల్స్ లో మొదట రాజీవ్ కనకాల నటించి తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చారు. విలక్షణ పాత్రను ఎంపిక చేసుకుంటూ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు రాజీవ్. ఇప్పటివరకు 150 చిత్రాల్లో రాజీవ్ కనకాల నటించారు.
Advertisement
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. తర్వాత సహాయ నటుడిగా నటించారు. విలన్ పాత్రలు కూడా చేశారు. అయితే రాజీవ్ కనకాల చాలా సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసారు. మరి రాజీవ్ కనకాల అలా నటించిన పాత్రల గురించి ఇప్పుడు చూద్దాం.
రాజీవ్ కనకాల స్వామి సినిమాలో నటించారు ఆ సినిమాలో రాజీవ్ కనకాల చనిపోతారు. అశోక్ సినిమాలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ స్నేహితుడు పాత్రలో నటించారు. ఆ సినిమాలో కూడా రాజీవ్ కనకాల చనిపోతారు. ఏ ఫిలిం బై అరవింద్ సినిమాలో కూడా ఇదే జరుగుతుంది. అతడు సినిమాలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారు. రాజీవ్ కనకాల ట్రైన్ లో వస్తుంటే చనిపోతారు.
Advertisement
హరే రామ్ సినిమాలో కూడా రాజీవ్ కనకాల చనిపోతారు. డాక్టర్ పాత్ర పోషించారు అందులో. దూకుడు సినిమాలో మహేష్ బాబు బాబాయ్ కింద నటించి ఆ సినిమాల్లో కూడా చనిపోవడం జరుగుతుంది. బాద్ షా సినిమాలో కూడా రాజీవ్ కనకాల చనిపోతారు. రాజా ది గ్రేట్, లవర్, రంగస్థలం, బింబిసారా, వీర సింహారెడ్డి సినిమాలో కూడా రాజీవ్ కనకాల చనిపోతారు. ఇలా ఈ సినిమాలన్నిటిలో కూడా రాజీవ్ కనకాల పాత్రలు చనిపోయేవే.
Also read: