Advertisement
చాలామంది వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా తిరుమల వెళ్తూ ఉంటారు. శ్రీవారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నీ శుభాలే జరుగుతాయని నమ్మకం. అయితే వెంకటేశ్వర స్వామి వారిని చూసినట్లయితే మూడు నామాలు ఉంటాయి. అయితే ఎందుకు కేవలం మూడు నామాలతో వెంకటేశ్వర స్వామిని అలంకరిస్తారు. దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
వెంకటేశ్వర స్వామి వారి రూపు చూడడానికి ఆకట్టుకుంటుంది. మూడు నామాలతో వెంకటేశ్వర స్వామి వారు చాలా బాగా కనపడతారు. వెంకటేశ్వర స్వామి వారిని చూడగానే మొట్టమొదట మనల్ని ఆ మూడు నామాలే ఆకట్టుకుంటాయి. తెలుపు నామాల మధ్య ఎరుపు చూర్ణం ఉంటుంది. ఎరుపు లక్ష్మి స్వరూపం. శుభసూచికం. తెల్ల నామాలు సత్వగుణాన్ని దాని వల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియపరుస్తాయి. అది పునాదిగా ఉండాలని కింద పాదపీఠం అనేది ఉంటుంది.
Advertisement
సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది దానిని సూచించేదే ఈ నిలువు బొట్టు. సత్వ గుణానికి అధిష్టాన దేవత మహావిష్ణువు. వెనుక రెండు తెల్లని ఊర్ధ్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు. స్వామివారికి మూడు నామాలే ఉండడానికి కారణం ఏంటంటే మొట్టమొదట రామానుజాచార్యులు ఆయన చేతులతో స్వామికి మూడు నామాలు పెట్టి అలంకరించారు.
అప్పటినుండి కూడా అలానే ఆయనని అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది కేవలం శుక్రవారం ఉదయాన్నే అభిషేక సేవ మొదలుపెట్టేటప్పుడు మాత్రమే భక్తులకి మూడు నామాలు లేకుండా స్వామివారు కనపడతారు. మళ్లీ వచ్చే శుక్రవారం అభిషేకం వరకు కూడా మూడు నామాలు అలానే ఉంటాయి. వారానికి ఒక్కసారి మాత్రమే నామాలని దిద్దుతారు.
Also read: