Advertisement
సినిమాలు నుండి చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పాత్రలు చేసే వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ కూడా రాణించలేక మళ్ళీ ఇండస్ట్రీకి రావడం, లాస్ట్ కి ఏదీ జరగక ఇబ్బంది పడడం వంటివి చూస్తూ ఉంటాము. కొంత మంది కమెడియన్లు ఏదో సాధించాలని రాజకీయాల్లోకి వెళ్తూ ఉంటారు. కానీ రాజకీయాల్లో కూడా మంచి ఫలితం రాక విమర్శల పాలవుతుంటారు.
Advertisement
అటువంటి కమెడియన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.. కమెడియన్ ఆలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు అలీ. ప్రస్తుతం వైసీపీ తరఫున మంచి పదవిని పొందినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో ద్వేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలీ ని మిత్రద్రోహి అని కామెంట్లు కూడా చేస్తున్నారు.
Advertisement
పవన్ కళ్యాణ్ కూడా దూరం పెడుతున్నారు. భవిష్యత్తు లో పవన్ కళ్యాణ్ అలీ కనపడే సీన్లు కూడా వుండవు ఏమో. ఆఫర్స్ కూడా అలీ కి తగ్గే అవకాశం ఉంది. పోసాని కృష్ణ మురళి కూడా సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లారు పవన్ కళ్యాణ్ ని విమర్శించడమే టార్గెట్ గా పెట్టుకున్నారేమో… పోసాని కృష్ణమురళి కూడా భవిష్యత్తులో అవకాశాలని కోల్పోవచ్చు.
అలానే సినిమా ఇండస్ట్రీ నుండి పృధ్విరాజ్ కూడా రాజకీయాల్లోకి వెళ్లారు. అతన్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు ప్రస్తుతం జనసేనలో పృథ్వీరాజ్ ఉన్నారు. వీళ్లందరినీ చూసి ప్రస్తుతం ఈ కమెడియన్లు రాజకీయాల్లో కరివేపాకులుగా మారారని అంతా అంటున్నారు. రాజకీయాల నుండి దూరంగా ఉంటే కొంచెం సినిమాలలో అవకాశాలైన వస్తాయని అంటున్నారు.
Also read: