Advertisement
తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా మిగిలినటువంటి వీఆర్ఏ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం వీఆర్ఏలుగా పని చేస్తున్న వారందరికిీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే రెవెన్యూ శాఖలో పని చేస్తున్న 20,555 మంది వీఆర్ఏలను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్దీకరించనున్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం వీఆర్ఏల క్రమబద్దీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసారు.
Advertisement
Advertisement
రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్దీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ అంశాలపై ఆదివారం రోజు రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుచుకుంటున్న భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ఈ సమావేశంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వుల కాపీని వీఆర్ఏల జేఏసీ నేతలకు అందజేశారు. అయితే నిబంధనలను అనుసరించి వీఆర్ఏలను అర్హతల ప్రకారం.. మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.