Advertisement
చాలామంది హీరోలే కాదు హీరోల వాళ్ళ భార్యలు కూడా ఫేమస్ అయిపోయారు. వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సెలబ్రిటీలైతే మరీ యాక్టివ్ గా వుంటున్నారు. రోజువారి అప్డేట్స్ని షేర్ చేసుకోవడం ఫ్యామిలీ ఫోటోలని పంచుకోవడం ఇలా.. అయితే ఈ హీరోల గురించి మాత్రమే కాదు వారి భార్యల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకు తీరాలి.
Advertisement
మహేష్ బాబు నమ్రత ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకి దూరమైంది. ఆమె టెక్స్టైల్ ఇండస్ట్రీ ని ఏర్పాటు చేసింది ఫ్యాషన్ వేర్ తో పాటుగా ఏషియన్ సంస్థతో లగ్జరీ మల్టీప్లెక్స్‌ని స్థాపించింది. తానే మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ పనులని చూసుకుంటుంది. అలానే మినర్వాతో కలిసి రెస్టారెంట్లని కూడా స్థాపిస్తోంది నమ్రత. రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బిజినెస్ లను చూసుకుంటుంది.
అపోలో హాస్పిటల్స్ కి వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంది ఉపాసన దీంతో పాటుగా ఎయిర్ లైన్స్ బిజినెస్ లోను కూడా ఆమె యాక్టివ్ గా ఉంటుంది. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అయితే తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది.
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎంబీఏ పూర్తి చేశారు త్వరలోనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. నాని భార్య అంజని రాజమౌళి స్కూల్లో చేరింది. ఆర్క మీడియాలో నాని భార్య అంజని క్రియేటివ్ హెడ్ గా పని చేస్తోంది.
అల్లరి నరేష్ భార్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ స్థాపించి విజయవంతంగా రాణిస్తోంది. సుమ గురించి చెప్పక్కర్లేదు. రాజీవ్ కనకాల భార్య సుమ కోట్లల్లో సంపాదిస్తోంది. రాహుల్ రవీంద్ర భార్య చిన్మయి అతని కంటే ఎక్కువ టాక్స్ కడుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
Also read: