Advertisement
వంట చేసుకోవడానికి పక్కా గ్యాస్ సిలిండర్ ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు గ్యాస్ సిలిండర్ మీద ఆధారపడిపోయారు. గ్యాస్ సిలిండర్ లో ఇంకా ఎంత గ్యాస్ ఉంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం… గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంతవరకు ఉందనేది తెలుసుకోవడానికి చిన్న ట్రిక్ ని ట్రై చేస్తే సరిపోతుంది. గ్యాస్ సిలిండర్ ని మీరు ఒకసారి తడి క్లాత్ తో తుడవండి. తుడిచాక రెండు లేదా మూడు నిమిషాల్లో సిలిండర్ పై ఉన్న కొన్ని ప్రదేశాల్లో తడి మొత్తం పోతుంది పొడిగా మారిపోతూ ఉంటుంది. మిగతా ప్రాంతం తడిగా ఉంటుంది.
Advertisement
Advertisement
ఆ ప్రదేశం పొడిగా అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఈ తేడాని గమనిస్తే సరిపోతుంది ఈసారి కావాలంటే ఇలా తడి క్లాత్ తో తుడిచి చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. సైంటిస్టులు ఈ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. గ్యాస్ బండలో గ్యాస్ ఉన్నచోట బయట వైపు చుట్టూ వాతావరణం చల్లగా ఉంటుంది. ఒకవేళ కనుక గ్యాస్ బండలో గ్యాస్ లేకపోతే ఆ ప్రాంతంలో బయటవైపు వాతావరణం వేడిగా కానీ సాధారణంగా కానీ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే తడి గుడ్డతో తుడిచినప్పుడు పొడి వాతావరణం లో నీరు ఫాస్ట్ గా ఆవిరి అయిపోతుంది. తడిగా కానీ చల్లటి వాతావరణం లో కానీ నీరు ఫాస్ట్ గా ఆవిరి అవుతుందట ఈ విధంగా మనం గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు కావాలంటే ఈసారి చిట్కా మీరు కూడా ట్రై చేయండి.
Also read: