Advertisement
రైతులకు ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే చాలా మంది రైతులు సహాయాన్ని పొందుతున్న విషయం తెలిసిందే. అయితే పెట్టుబడి సహాయం అందుకుంటున్న రైతులు అలర్ట్ గా ఉండండి. 14వ విడుత విడుదల కి సంబందించి ఓ విషయం బయటికీ వచ్చింది. ఏ తేదీన డబ్బులు వస్తాయనేది సమాచారం అందింది. జులై 27న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నగదు అకౌంట్ లో జమ అవ్వనున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement
రాజస్థాన్ లోని సికార్ లో జరుగనున్న కార్యక్రమం వేదికగా రైతుల ఖాతాల్లో జమా చేయనున్నారు భారత ప్రధాని మోడీ. రైతులు మాత్రం ఓ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే మాత్రం రైతులకు తగిన అర్హతలు పక్కాగా ఉండాలి. దీంతో పాటు కొన్ని పనులను కూడా చేసేయాలి. లేదంటే డబ్బులు పడవు అని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే చివరి రెండు, మూడు విడతలు డబ్బులు రాని రైతులు చాలా మంది ఉన్నారు.
పీఎం కిసాన్ డబ్బులు పొందాలనుకునే రైతులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆన్ లైన్ లోనే ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో సింపుల్ గా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. భూమికి సంబంధించిన పత్రాలను కూడా ధృవీకరించాలి. బ్యాంకు అకౌంట్ కి ఆధార్ నెంబర్ ని లింక్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తి అయితేనే డబ్బులు వస్తాయి. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒక సారి చూసుకోండి.