Advertisement
దేశంలో మహిళలు, బాలికల అదృశ్యం పై గణాంకాలను కేంద్రం బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే 2019-21 మధ్య దాదాపు 30వేల మంది బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర మంత్రి వెల్లడించారని.. ఇప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బాలికలు మహిళలు ఎందుకు అదృశ్యం అవుతున్నారని ప్రశ్నించారు.
Advertisement
దీనిపై హోంమంత్రి డీజీపీని ఏపీ మహిళా కమిషన్ వివరణ అడగగలదా చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వంపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోగలదా చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళలు అదృశ్యం అయ్యారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. 2019-21 లో 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమైనట్టు తెలిపారు.
Advertisement
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలను వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి మూడేళ్లలో 72వేల767 మంది బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారని స్పష్టం చేసింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అదృశ్యమైన వారిలో 15వేల 994 మంది బాలికలు ఉన్నారు. 56, 773 మంది మహిళలు ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. రికార్డు ప్రకారం.. ప్రతీ సంవత్సరం ఏపీ, తెలంగాణలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్న కేసులు ఏటా పెరుగుతున్నాయని నివేదికలో ప్రస్తావించారు.