Advertisement
పశ్చిమబెంగాల్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. బీర్ భూమ్ జిల్లా బోల్ పూర్ లో ప్రియుడి పెదాలను కోసివేశారు ప్రియురాలు కుటుంబ సభ్యులు. అంతకు ముందు ప్రియురాలు, ప్రియుడి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ యువతి కుటుంబం ప్రియుడిని ఇంటికి పిలిపించి కత్తితో పెదవులను కోసారు. వివరాల్లోకి వెళ్లితే.. బీర్ భూమ్ జిల్లా కాశీపూర్ గ్రామానికి చెందిన మోమినుల్ ఇస్లాం అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన బోజో ఖాన్ కుమార్తెను ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు.
Advertisement
Advertisement
ప్రేమికులిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో ప్రేమ వివాదాన్ని ముగించేందుకు ప్రియురాలి బంధువులు ప్రియుడు మోమినుల్ ఇస్లాంను ఇంటికి పిలిపించారు. తొలుత ప్రియుడు, ప్రియురాలి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. ప్రియుడు వినకపోవడంతో పెద్ద గొడవ జరిగింది. దీంతో ప్రియురాలు కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి మోమినుల్ పెదవులను కోసారు. దీంతో ప్రియుడు రక్తంలోనే తడిసిపోయాడు. ప్రియుడు సంఘటన స్థలం నుంచి ఎలాగోలా తన ఇంటికి చేరుకున్నాడు. అతన్ని చూసి కుటుంబ సభ్యులు అంతా షాక్ కి గురయ్యారు. వెంటనే అతడిని బోల్ పూర్ లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికీ అత్యవసర చికిత్స అందించగా.. ఆ తరువాత వైద్యుల సలహా మేరకు బోల్పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు యువకుడికి సరైన వైద్యం అందడం లేదని బందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు