Advertisement
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది.ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపోటీ ఉండనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా బలంగానే కనిపిస్తోంది. అయినప్పటికీ బీజేపీ కంటే కాంగ్రెస్ కాస్త ముందంజలో కనపడుతోంది.
Advertisement
ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా మహూబూబ్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Advertisement
మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాధ అమర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు, కౌన్సిలర్ రమాదేవి, పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. తెలంగాణ కూడా అధికారంలోకి తీసుకొచ్చేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కి కాస్త వ్యతిరేకత ఉందనే చెప్పవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచి చూడాలి మరీ.