Advertisement
రాముడు రావణుడి పై యుద్ధం గెలిచాడు. రావణుడు చనిపోయే ముందు రాముడి తో ఈ విషయాలని చెప్పాడు. మరి ఇక అవేమిటో చూద్దాం. రావణుడు చనిపోయే ముందు ఇలా రాముడి తో అన్నాడు. రామా నీ కన్నా నేను అన్నింట్లో కూడా గొప్పవాడిని. నేనేమో బ్రాహ్మణ జాతికి చెందిన వాడిని. నువ్వేమో క్షత్రియ జాతి వాడివి. నీకంటే వయసులో నేను ఏమో పెద్దవాడిని. పైగా నా కుటుంబం చాలా పెద్దది. అలానే నా వైభవం కూడా నీ వైభవం కంటే అధికమైనది.
Advertisement
Advertisement
నీ అంతఃపురం స్వర్ణమైతే నా లంక అంతా కూడా బంగారమే. నీ కంటే నేను బల పరాక్రమాల్లో శ్రేష్టుడిని. ఇలా ఏ విషయాల్లో అయినా కూడా నేను ముందు ఉన్నాను. అయినా కూడా యుద్ధంలో ఓడిపోయాను. నువ్వే గెలిచావు. అయితే నేను యుద్ధం లో ఓడిపోవడానికి ఒకే ఒక్క కారణం ఏమిటంటే.. నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు. కానీ నా తమ్ముడు నా వద్ద లేడు. అందుకే నీ చేతిలో ఓడిపోయా అని అన్నాడు రావణుడు. కలిసి ఉంటే దేనినైనా మనం సాధించడానికి అవుతుంది. ఎంతటి కష్టాన్నైనా కూడా మనం ఎదుర్కోవచ్చు.
Also read:
- పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక.. ఆ వైసీపీ నేత వున్నారని మీకు తెలుసా..?
- దర్శకుడు సూర్యకిరణ్తో కళ్యాణి ఎందుకు విడిపోయింది..?
- కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. ఎంతంటే ?