Advertisement
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి 65.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ రోడ్డు అని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65ని ఆరు లేన్లుగా మారుస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 వరుసల నిర్మాణ పనులు కొనసాగుతున్నట్టు చెప్పుకొచ్చారు వెంకట్ రెడ్డి. హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతోందని.. ప్రజా అవసరాల దృష్ట్యా రోడ్డును అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరముందని ప్రధాని మోడీని కోరినట్టు ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ప్రస్తుత హైవేకు సమాంతరంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని ప్రధానికి విన్నవించినట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్-విజయవాడను కలిపే రహదారిలో 17 బ్లాక్ స్పాట్ల మరమ్మతు అంశంపై మరింత నజర్ పెట్టాలని ప్రధానికి ఎంపీ వెంకట్ రెడ్డి సూచించినట్టు తెలిపారు. ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు అంశాలపై కూడా ప్రధాని