Advertisement
ప్రేమించిన వాళ్ల కోసం, పెళ్లి చేసుకున్న వ్యక్తి అడ్డు తొలగించుకోవడానికి ఎన్నో దారుణాలకి పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. శారీరిక, ఆర్థికపరమైన సంబంధాలు ఎంతటి దారుణానికైనా దారి తీస్తాయని ఇది చూస్తే మనకి తెలుస్తుంది. తాజాగా విశాఖపట్నంలో ఒక సంఘటన చోటుచేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే.. బర్రి రమేష్ వైజాగ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. శివజ్యోతి అలియాస్ శివానీతో పెళ్లయింది. శివానీ కి ట్యాక్సీ డ్రైవర్ రామారావుతో పరిచయం ఏర్పడి… ఆఖరికి శారీరికంగా దగ్గరయ్యారు.
Advertisement
Advertisement
భర్తకు ఇది తెలిసి మందలించాడు. పలుమార్లు దొరికిపోవడంతో ఆమె ని అతనితోనే వెళ్లిపోమ్మని కూడా చెప్పాడట. భర్త అడ్డు తొలగించాలని నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయల సుఫారీ ఇచ్చింది. రమేష్ కు మద్యం ఇచ్చేసి వీడియోలు కూడా తీసింది, అతను నిద్రపోయాక రమేష్, నీలాలను పిలిచింది. ముగ్గురు కలిసి దిండు పెట్టి బలంగా నొక్కారు. ఇదంతా కూడా వీడియో తీసింది. తెల్లారేసరికి గుండె పోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. రమేష్ మృతిపై అనుమానాలు వచ్చి అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారనిచగా ఆస్తి కోసం హత్య చేసినట్లు శివానీ ఒప్పుకుంది.
Also read:
- బాలయ్య భార్య సెంటిమెంట్ ఉందని మీకు తెలుసా..?
- బ్రో మూవీలో ఆ సీన్ ను తొలగించడానికి కారణమిదేనా.. వైసీపీ నేతల కోసమే అలా చేశారా?
- నటుడు ప్రియదర్శి కిడ్నీలు అమ్ముకున్నాడా ?