Advertisement
ఇండస్ట్రీ లోకి చాలామంది వస్తూ ఉంటారు. వెళుతూ ఉంటారు. అయితే ఎవరు ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు..? ఎవరు ఇండస్ట్రీ లో విఫలం అవుతారు అనేది ఎవరూ చెప్పలేము. కొంతమంది సినిమాల్లో బాగా రాణించగలుగుతారు కొంతమంది మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే అదృష్టం వరించి స్టార్ హీరోలుగా మారి అత్యధిక ధనవంతులుగా కూడా కొంతమంది హీరోలు మారిపోయారు. ఈ హీరోలు సినిమాల్లోకి రాకముందు ఏ ఉద్యోగం చేసేవారో ఇప్పుడు చూసేద్దాం.
Advertisement
విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందు ట్యూషన్ మాస్టర్ గా పనిచేసేవాడట. కానీ చాలామందికి ఈ విషయం తెలీదు. అలానే అమితాబ్ బచ్చన్ సినిమాల్లోకి రాకముందు కలకత్తాలోని ఒక ప్రముఖ షిప్పింగ్ యార్డ్ సంస్థ లో ఎగ్జిక్యూటివ్ గా పని చేసేవారట. అల్లు అర్జున్ అయితే సినిమాల్లోకి రాకముందు యానిమేటర్ గా పని చేశారు. షారుక్ ఖాన్ సినిమాల్లోకి రాకముందు అటెండర్ గా పని చేశారు.
Advertisement
సూర్య సినిమాల్లోకి రాకముందు గవర్నమెంట్ సంస్థలో పనిచేశారు. హాస్యనటుడు బ్రహ్మానందం అయితే సినిమాల్లోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పనిచేసేవారట. మోహన్ బాబు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. గోపీచంద్ అయితే సినిమాల్లోకి రాకముందు ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పనిచేసేవారట. సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ బస్ కండక్టర్ గా పని చేశారు. ఆది పినిశెట్టి క్రికెటర్ గా ఉండేవారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సినిమాల్లోకి రాకముందు సుధీర్ బాబు బ్యాడ్మింటన్ ఆడేవాడట.
Also read: