Advertisement
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలే చేశారు. పల్లె పట్టణ ప్రగతిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఏకగ్రీవం అయిన గ్రామపంచాయతీలకు నిధులు ఇస్తామని ఇంకా ఇవ్వలేదని ప్రశ్నించారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రాక, చేసిన పనులకు బిల్లులు రాక చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని పేర్కొన్నారు భట్టి అయితే దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. పాదయాత్ర చేసి భట్టి అలసిపోయారని.. మీ బాధను మేము అర్థం చేసుకుంటామని పేర్కొన్నారు. ముఖ్యంగా మీ పార్టీలో క్లారిటీ లేదు.. మీకు క్లారిటీ లేదు.
Advertisement
Advertisement
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చిన్నపిల్లలకు ఎక్కాలు రావు.. కాంగ్రెస్ లీడర్లకు లెక్కలు తెలియవు అన్నారు. ఆ పార్టీలో ఉన్నది 10 మంది అని.. అందరూ సీఎం అభ్యర్థులే అని ఎద్దేవా చేసారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ కలలు కంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాలు అన్నీ ఇప్పుడు కోనసీమలా మారాయని పేర్కొన్నారు. దేశం నలుమూలల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నాయని.. రివర్స్ మైగ్రేషన్ జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో నీళ్ల కోసం మహిళలు అష్టకష్టాలు పడ్డారని.. ఇంకా కరెంట్ కోసం కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. మాకు అభివృద్ధిలో కట్టడం మాత్రమే తెలుసు అని.. ప్రతిపక్షాలకు కూలగొట్టడమే తెలుసు అన్నారు. భట్టి విక్రమార్క ప్రతిపక్షంలో 100 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు కేటీఆర్.