Advertisement
అలనాటి నటి సావిత్రి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సీనియర్ స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి గురించి అందరికీ తెలుసు. ఆమె జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంత సక్సెస్ ని అందుకున్నారు అనేది మనకి తెలిసిన విషయమే. నిజజీవితంలో పెళ్లి తర్వాత సావిత్రి కి సినీ ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాలేదు. భర్త జెమినీ గణేషన్ తో కలిసి నటించిన సినిమాలన్నీ విఫలమయ్యాయి. సొంతంగా ఇద్దరూ కలిసి చేసిన సినిమాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత జెమినీ గణేషన్ ప్రవర్తన పట్ల సావిత్రి జెమినీ గణేషన్ మధ్య గొడవలు కూడా వచ్చాయి.
Advertisement
Advertisement
భర్త మీద కోపంతో సావిత్రి ఎవరు చెప్పినా, ఎంత మంది చెప్పినా వినకుండా సొంత డబ్బుతో చిన్నారి పాపలు అనే సినిమా తీసి ఆర్థికంగా నష్టపోయింది. షావుకారు జానకి, జమున వంటి స్టార్ హీరోయిన్లతో సావిత్రి సినిమా తీసింది. ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఆ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అనుకున్న సమయానికి చిన్నారి పాపలు సినిమాని సావిత్రి పూర్తి చేయలేక పోయింది ఆర్థికంగా ఎన్నో నష్టాలు వచ్చాయి. ఆ సమయంలోనే సావిత్రి పై ఐటి శాఖ దాడులు జరిగాయి ఇలా సావిత్రి ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన చిన్నారి పాపలు మూవీ ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా కృంగతీసేసింది. ఒకవేళ కనుక ఆమె సినిమా చేయాలనీ అనుకోకపోయి ఉంటే ఆమె ఆర్థికంగా అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనేది కాదట.
Also read: