Advertisement
ప్రతి మనిషి కూడా ఎలా భిన్నంగా ఉంటారో, పిల్లలు కూడా అలానే భిన్నంగా ఉంటారు. అందరి పిల్లలు మనస్తత్వం కానీ పిల్లల ఆలోచన, అల్లరి వేరుగా ఉంటుంది. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట అస్సలు వినరు. అలా మీ పిల్లలు కూడా ప్రవర్తిస్తున్నట్లయితే ఈ చిట్కాలు ని ట్రై చేయండి. మీ పిల్లలు మీ మాట వినకపోయినట్లయితే నేరుగా వారికి చెప్పండి. వారు ఏం చేస్తే మంచిది, ఏం చేయకూడదు అనే విషయాన్ని అర్థమయ్యేలా పిల్లలకి చెప్పాలి. అలానే వాళ్ళతో మాట్లాడి ప్రశ్నలు వెయ్యండి. సమాధానాలు చెప్పేలా చూడండి. అప్పుడు వాళ్ళు సరిగ్గా వింటున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు.
Advertisement
Advertisement
మీ మాటల్ని కనుక పిల్లలు వినక పోతుంటే హెచ్చరించండి. తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశాన్ని ఇవ్వండి. మళ్లీ మళ్లీ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. అలానే పిల్లలు ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వండి మీ పిల్లలు మీ మాట వినకపోతే మీరు కూడా వారి మాట విననని చెప్పండి. వాళ్లు అది చేయకపోతే నేను కూడా ఇది చేయను అని ఉదాహరణకి ఏదో ఒకటి చెప్పండి. ఇలా మీ పిల్లలు మీ మాట వినేటట్టు మీరు మార్చుకోవచ్చు. నిందించడానికి బదులుగా మీరు ఇలా ఈ చిట్కాలు ని ట్రై చేసి మీ పిల్లల మనసుని మార్చొచ్చు. మీ పిల్లలు మీ మాట వినేలా మార్చుకోవచ్చు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి కచ్చితంగా మీ పిల్లలు మీ మాట వింటారు.
Also read: