Advertisement
నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రజనీకాంత్, రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్, సునీల్, మిర్నా మేనన్, వసంత్ రవి, యోగిబాబు, మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో నటించారు. మారన్ ఈ సినిమాని నిర్మించారు. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.
Advertisement
నటీనటులు : :రజనీకాంత్,రమ్యకృష్ణ,జాకీ ష్రాఫ్ సునీల్,మిర్నా మేనన్,వసంత్ రవి,యోగిబాబు,మోహన్ లాల్ తదితరులు
దర్శకుడు : నెల్సన్ దిలీప్ కుమార్
నిర్మాత : మారన్
సంగీతం : అనిరుద్ రవిచందర్
విడుదల తేదీ: 10-08-2023
కథ మరియు వివరణ:
టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) భిన్నభావాలు కలిగిన వ్యక్తి. అతను ఒక కఠినమైన జైలర్. ఖైదీలను క్రమశిక్షణలో ఉంచడానికి కఠినమైన రూల్స్ ని తీసుకు వస్తాయి. పాండియన్ వాళ్ళది ఒక మంచి కుటుంబం. అతను బాధ్యత గల తండ్రిగా, ప్రేమని పంచే భర్తగా ఉంటాడు పాండియన్. టైగర్ ముత్తువేల్ పాండియన్ జైలర్‌గా ఉన్న జైలు నుంచి గ్యాంగ్ స్టర్‌ని తప్పించకుండా చూస్తాడు.
Advertisement
అయితే, ఆ ప్రయత్నంలో గ్యాంగ్‌స్టర్ ముఠా పాండియన్ కొడుకుని దారుణంగా చంపేస్తారు. దీనితో అతని అసలు రూపం బయటకు వస్తుంది. మాములు జైలర్ అత్యంత క్రూరుడుగా ఎలా మారాడు…? ఎందుకు అలా మారాడు.. ? పగ, బాధ్యత తో అసలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.
నటీ నటులు బాగా వాళ్ళ పాత్రలు పోషించారు. మలయాళం హీరో మోహన్‌లాల్, కన్నడ హీరో శివరాజ్‌కుమార్, హిందీ నాటుఫు జాకీ ష్రాఫ్, తెలుగు నుండి నాగబాబు, సునీల్ నటించారు. ఇలా ఎవరి పాత్రల్లో వాళ్ళు ఇమిడిపోయారు. విజయ్ కార్తీక్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంది. చాలా సీన్స్ ని ఎలివేట్ చేసి చూపారు. ఇవన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ కాస్త సాగదీసినట్టు వున్నాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
బీజీఎమ్
కథ
కొన్ని స్ట్రాంగ్ సీన్స్
ఇంటర్వెల్ ఫైట్
గూస్ బంప్స్ ని తెప్పించే సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా మెప్పించని సీన్స్
రేటింగ్ : 3.5/5
Also read: