Advertisement
సాధారణంగా మీ జాతకంలో అదృష్టం ఉంటే.. అది ఏ జన్మలో అయినా రాజాలా బతికేస్తావు అన్నదానికి ఈ వీధి కుక్కలు నిదర్శనమేమో మరి. ఈ వీధికుక్కలకు ఇక్కడ జరిగే రాచమర్యాదలు చూస్తే.. మనుషులకు కుళ్లు పడుతుంది. సాధారణంగా బతుకు దుర్భరంగా అనిపించినప్పుడు నేను బతుకుతున్నది వీధి కుక్క బుతుకుతుంది అంటూ తమను తామే పోల్చుకుంటుంటారు. అయితే ఇప్పుడు అవి కూడా మహారాజులా దర్జాగా రాజభోగాలనుభవిస్తూ బ్రతుకుతున్నాయి. వీధి కుక్కల పేరిట కోట్లాది ఆస్తి ఉంది. గుజరాత్ లోని మెహసానా జిల్లాలో వీధి కుక్కలు కోట్లకు అధిపతులు అనే విషయం మీకు తెలుసా ? అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
గుజరాత్ లోని పంచోత్ గ్రామానికి చెందిన కుక్కలు కోట్లకు అధిపతులు. వాటి పేరిట ఏకంగా రూ.75కోట్లు ఆస్తులు ఉన్నాయి. వాటి నిర్వహణకు ఆ ఊరు అంతా కట్టగట్టుకొని పని చేస్తుంటారు. రోజుకు 400 రోటీలు, హల్వాలు, ఇలా ఎవ్వరి ఇంట్లో ఏ కార్యమైనా ఫస్ట్ భోజనం ఈ కుక్కలకేనట. ఇక ఆ తరువాత ఇంట్లో వాళ్లకు. వచ్చిన జనాలకు.. స్వతంత్రానికి ముందే నవాబులు ఈ ఊరికి 22 ఎకరాల పొలం రాసిచ్చారు. జనాలకు కాదు.. కుక్కలకు.. ఆ పొలంలోనే పెరుగుతాయనే ఆలోచనలతో ఇచ్చారు. అప్పటి నుంచి కుక్కల పేరుమీదనే ఉంది. తరతరాలు మారినా ఆ భూమిని మాత్రం కుక్కలకే ఉంచారు. ఏడాదిలో ఒకసారి శ్రీరామనవమికి పొలాన్ని వేలం వేస్తారు. కౌలుకు ఇవ్వడానికి.. కౌలుకి తీసుకున్న తరువాత వచ్చిన డబ్బులను కుక్కల పోషణకు వాడుతారు. కొంత మొత్తాన్ని ఊరు బాగోగులకు వాడుతారంటున్నారు. అందుకే అక్కడి కుక్కలు చాలా రిచ్ అనే చెప్పవచ్చు. ఇన్నాళ్లు యినా ఆ ఊరి కట్టుబాట్లను మార్చకుండా ఫాలో అవుతున్న వారు గ్రేట్ అనే చెప్పాలంటున్నారు ఇది విన్నవారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పీరియడ్స్ మిస్ అవుతుంటే.. సోంపు తో చక్కటి పరిష్కారం పొందొచ్చు..!