Advertisement
గద్దర్ అంటే తెలంగాణలో తెలియని వారుండరు. ప్రజా యుద్ధనౌక హఠాన్మరణం పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచింది. గద్దర్ ఉద్యమ ప్రస్థానం నుంచి జీవిత చరమాంకం వరకు దేని కోసం తపించారు? ఏ లక్ష్యం కోసం పోరాడారు? అసలు అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు ఎవరు కోరారు ? ఒకప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా బాధపెట్టింది ఎవరు ? వంటి ప్రశ్నలకు గద్దర్ కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెలో ఓ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పారు.
Advertisement
ముఖ్యంగా ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిపించాలని తాము కోరలేదని.. అది ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ అని తెలిపారు సూర్యం. రాజకీయ జీవితంపై ఆయన ఉద్ధేశం ఏంటి అనేది బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ప్రజా పార్టీ అనేది గద్దర్ చివరి కోరిక అని గద్దర్ కొడుకు సూర్యం వెల్లడించారు. ఆ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది బలమైన ఆలోచన అన్నారు. ముఖ్యంగా తాను చనిపోయిన తరువాత ప్రభుత్వాన్ని ఏమి అడగొద్దని తండ్రి తమతో చెప్పారని గద్దర్ కొడుకు సూర్యం, కూతురు వెన్నెల వెల్లడించారు.
Advertisement
అదేవిధంగా గద్దర్ కి దాదాపు 3 గంటల పాటు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానపరిచారని.. ప్రగతి భవన్ ముందు మూడు గంటల పాటు ఎండలో గద్దర్ ని వెయిట్ చేయించారని..అది ఆయనను ఎంతో బాధపెట్టింది అని చెప్పుకొచ్చారు గద్దర్ వారసులు. గాంధీ కుటుంబంతో గద్దర్ కి అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజకీయాలు చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదన్నారు. త్వరలోనే మా భవిష్యత్ కార్యచరణ ఏంటో ప్రకటిస్తామని వెల్లడించారు గద్దర్ వారసులు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు