Advertisement
మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. చిరంజీవి, కీర్తి సురేష్, సురేష్, సుశాంత్, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో నటించారు. అనీల్ సుంకర, కె ఎస్ రామారావు సుంకర ఈ సినిమాని నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు.
Advertisement
నటీనటులు : చిరంజీవి, కీర్తి సురేష్, సురేష్, సుశాంత్, మురళీ శర్మ తదితరులు
దర్శకుడు : మెహర్ రమేష్
నిర్మాత : అనీల్ సుంకర, కె ఎస్ రామారావు సుంకర
సంగీతం : మహతి స్వర సాగర్
విడుదల తేదీ: 11-08-2023
కథ మరియు వివరణ:
కోల్‌కతాలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మి (కీర్తి సురేష్) తో కలిసి అక్కడకి వెళ్తాడు. అక్కడ కొంత మంది అమ్మాయిలని కిడ్నాప్ చేస్తారు. ఎందుకు అసలు అమ్మాయిల ని కిడ్నప్ చేస్తున్నారు..? ఎందుకు ఇలా అసలు జరుగుతోంది..? అంతా తెలుసుకుని భోళా శంకర్ ఏం చేశాడు..? ఆ అమ్మాయిలు అందరూ ఏం అవుతారు..? ఇవన్నీ చూడాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
ఇది రీమేక్ సినిమా అన్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ మార్పులు ఏమి చేయలేదు. ఒరిజినల్ సినిమాలో వున్నట్టే వుంది. ఈ సినిమాలో పాటలు, కొన్ని సీన్స్ తప్ప పెద్దగా చెప్పుకునే అంశాలు అయితే ఏమి లేవు. మూవీ ముందుకి వెళ్లే కొద్ది ప్రేక్షకులకి తర్వాత ఏమవుతుంది అనేది అర్ధం అయిపోతుంది. చిరంజీవి మాత్రం ఈ మూవీ లో బాగా నటించారు.
కథ లో కొత్తగా ఏమీ లేదు. నటీ నటులు అందరు పాత్రలకి తగ్గట్టు బానే చేసారు. పాటలు ఇంకా బాగుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగానే వుంది. శ్రీముఖికి, చిరంజీవికి మధ్య వచ్చే ట్రాక్ ఎందుకు పెట్టారో తెలీదు. ఎమోషన్స్ అస్సలు కనెక్ట్ కాలేదు. అలానే స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది.
ప్లస్ పాయింట్స్:
చిరు నటన
లొకేషన్స్
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే
కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
తెలిసిపోతున్న ఎండింగ్
రేటింగ్ : 2.5/5
Also read:
- రీ రిలీజ్‌లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు ని రాబట్టిన సినిమాలు ఇవి.. ఫస్ట్ ప్లేస్ లో ఏది అంటే..?
- రాజమౌళి కి ఆ స్టార్ ప్రొడ్యూసర్ బావ అని మీకు తెలుసా..?
- సూర్యాస్తమయం తర్వాత వీటిని చూస్తే.. డబ్బుకి లోటు ఉండదు..!