Advertisement
చరిత్ర పుటల్లో ఎంతో మంది మేధావులు ఎన్నో సంస్కరణలు చేసి మంచి పేరును సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఆచార్య చాణిక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికి మానవ ప్రపంచంలో ఉపయోగిస్తున్నారు. ఆ సూత్రాలను పాటిస్తూ మనం ముందుకు వెళితే జీవితంలో ఏదైనా సాధించగలమని గమనించాలి.. ఆచార్య చాణిక్యుడు ముఖ్యంగా తన నీతి శాస్త్రం ద్వారా స్త్రీల గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను చెప్పారు. అవేంటో ఒకసారి చూద్దాం.. ఇందులో ముఖ్యంగా రెండు రకాల గుణాలు కలిగిన స్త్రీలను దూరంగా ఉంచాలని అన్నారు.
Advertisement
అత్యాశ గల మహిళలు:
మహిళల్లో అత్యాశ ఎక్కువగా ఉండకూడదని, అలా అత్యాశ ఉన్నటువంటి స్త్రీ ని మనం దూరంగా పెట్టాలని తెలియజేశారు. ఈ విధమైన గుణం ఉన్నటువంటి మహిళలు కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే ఆలోచన చేస్తారని, తన తర్వాతనే వారి పిల్లల గురించి కుటుంబం గురించి ఆలోచిస్తారని తెలియజేశారు. ఈ విధమైన గుణం ఉన్న స్త్రీ ఎప్పటికైనా మనకు ప్రమాదకరమని ఇలాంటి వారిని గుర్తించి ముందుగానే దూరం పెట్టాలని ఆచార్య చాణిక్య నీతి శాస్త్రం ద్వారా తెలియజేశారు.
Advertisement
బద్ధకం :
ఒక వ్యక్తి తన అనుకున్నా లక్ష్యాన్ని సాధించలేదు అంటే దానికి కారణం బద్ధకం. ఇలా బద్ధకం ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వారి సంసార జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వీరు బద్ధకం గా ఉండడమే కాకుండా పక్క వారిని కూడా బద్ధకస్తులు గా మారుస్తారని చాణక్యుడు తన నీతి గ్రంథంలో తెలియజేశాడు. ఇలా బద్దకమైన స్త్రీలు కుటుంబంలో ఉండడం వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు. ఇలాంటి వారిని కూడా దూరంగా పెట్టాలని చాణిక్యుడు అన్నారు.