Advertisement
హిందీ భాష విషయంలో కేంద్రం వర్సెస్ తమిళనాడు అన్నట్టుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రం భారత్ లో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సంచలన కామెంట్స్ చేసింది.
Advertisement
Advertisement
కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం పట్ల డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా సీఎం స్టాలిన్ కేంద్రం తెచ్చిన మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం భాషా సామ్రాజ్యవాదమని మండిపడ్డారు. సమైక్య భారత దేశ మూలాలను కించపరచడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్ లో తమిళం అనే పదాన్ని పలకడానికి బీజేపీకి ప్రధాని మోడీకి హక్కు లేదన్నారు. కేంద్రం తెచ్చిన బిల్లులపై పార్లమెంట్ లో డీఎంకే ఎంపీ విల్సన్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడు బిల్లుల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని డిమాండ్ చేశారు.
Also Read :