Advertisement
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త అనే చెప్పాలి. బస్సు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి తాజాగా టీఎస్ఆర్టీసీ మరో యాప్ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్ ప్రయాణికులకు తెలంగాణ, సమీప రాష్ట్రాల్లోని వివిధ స్టాప్ లలో టీఎస్ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్న చోటుకు బస్సుల ఆగమనం, నిష్క్రమణను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రయాణికులు బస్టాప్ , బస్ స్టేషన్ లలో వేచి ఉండే సమయాన్ని నివారించడానికి వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
Advertisement
Advertisement
ఈ యాప్ ప్రారంభించిన తరువాత టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ఈ యాప్ పుష్పక్ ఏసీ ఎయిర్ ఫోర్ట్ బస్సులు, టీఎస్ఆర్టీసీ అన్ని ఎక్స్ ప్రెస్, ఎక్కువ ప్రత్యేక రకం బస్సు సర్వీసులను సమాచారంతో బోర్డింగ్ దశ, మీ ప్రయాణ షెడ్యూల్ ని ముందుగానే ప్లాన్ చేసేందుకు ఎంచుకున్న గమ్య స్థానాన్ని రియల్ టైమ్ ట్రాకింగ్ అందిస్తుంది. రిజర్వేషన్ టిక్కెట్ లో అందించిన సర్వీస్ నెంబర్ ఆధారంగా రిజర్వేషన్ బస్సులను కూడా ట్రాక్ చేస్తుంది. షెడ్యూల్, బస్సు మార్గాల సమాచాారాన్ని నవీకరించింది అని సజ్జనార్ పేర్కొన్నారు. ఇల్లు, ఆఫీస్, షాపింగ్, ఫంక్షన్ లేదా మరేదైనా ప్రదేశానికి సమీపంలోని బస్టాప్ కి బస్సు రాకపై కచ్చితమైన సమాచారాన్ని అందించడంద్వారా యాప్ బస్సుల్లో ప్రయాణించే అనుభవాన్ని మెరుగుపరుస్తుందని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Also Read :