Advertisement
హీరోయిన్ అనన్య పాండే గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చుంకీ పాండే నట వారసురాలిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో బాలీవుడ్ కి పరిచయం అయింది. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డును అందుకుంది అనన్య పాండే. తెలుగులో పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన లైగర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. లైగర్ విడుదలకు ముందు ఈమె ఎంట్రీ గురించి తెలుగు అభిమానులు భారీగా చర్చించుకున్నారు. కానీ విడుదలైన తరువాత ఈమె నటన చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు అది నటనా ? అనే అనుమానం కూడా కలిగిందనే విమర్శలు వచ్చాయి. లైగర్ మూవీ డిజాస్టర్ తో మళ్లీ తెలుగు వైపు ఈమె కన్నెత్తి కూడా చూడలేదు.
Advertisement
Advertisement
బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా కోసం పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిన్నది స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని పార్టీలకు, ఫంక్షన్స్ కి హాజరు కావడం.. కెమెరా కంట పడటంతో వీరిద్ధరి మధ్య ఎఫైర్ నడుస్తుందని నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలోనే అనన్య ప్రెగ్నెంట్ అయిందని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ప్రధానంగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఈ మధ్య కాలంలో అనన్య పాండే అబార్షన్ చేయించుకుందని.. ఎందుకంటే ఆమె ఆదిత్య రాయ్ కపూర్ వల్లనే ప్రెగ్నెంట్ అయిందని అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Also Read :