Advertisement
ప్రేమించడం తప్పు కాదు ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం పెద్ద తప్పు. తెలిసి తెలియని వయసులో ఒక అమ్మాయి చేసిన తప్పు వలన ఆమె తల్లిదండ్రులకి తీవ్ర గుండె కోత ని మిగిల్చింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగా మూడు కుటుంబాల్లో విషాదం జరిగింది. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. పైగా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో పాటుగా ఇంకొకరి మృతికి కారణమైంది.
Advertisement
వివరాల్లోకెళితే కొత్తపాలెం నాగేంద్ర కాలనీకి చెందిన 16 ఏళ్ల అమ్మాయి ఆదర్శ్ నగర్ కి చెందిన సూర్య ప్రకాష్ రావుతో ప్రేమలో పడింది. ఇందిరా నగర్ కి చెందిన లెంకా సాయికుమార్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఇది ఇలా ఉంటే సాయికుమార్ తో ఆమె క్లోజ్ గా ఉండడం సూర్య ప్రకాష్ కి నచ్చలేదు దీంతో ఆమెకి వారిద్దరితో కూడా మనస్పర్ధలు వచ్చాయి.
Advertisement
ఆ అబ్బాయిలు ఇద్దరు కూడా అమ్మాయి ఇంటికి వేరువేరు సమయాల్లో వచ్చి ఎవరితో ఉండాలో నిర్ణయించుకోమని చెప్పారు. వాళ్ళు ఇలా చెప్పిన రెండు రోజులకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు విచారణ చేపట్టారు వాళ్ళిద్దరూ ఒత్తిడి చేయడంతోనే ఆమె చనిపోయిందని చెప్పారు. అయితే పోలీసు విచారణని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళనతో ప్రియుడు సూర్య ప్రకాష్ గోపాలపట్నం దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ స్టూడెంట్ అయిన సాయికుమార్ ని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి తరలించారు.