Advertisement
సుధా మూర్తి గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. సుధా మూర్తి మనందరికీ సుపరిచితమే. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధా మూర్తి అందరికీ తెలుసు. ఆమె తరచుగా వార్తలలో హైలెట్ అవుతూ కూడా ఉంటారు. ఆమె మాట్లాడే మాటలు అందర్నీ ఆకట్టుకుంటుంటాయి. అప్పుడప్పుడు ఆమె చాలా మంచి విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు.
Advertisement
ఇదివరకు వెజ్ నాన్ వెజ్ స్పూన్ అని చెప్పిన విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన పాట ఏది అని అడిగితే ఆమె ప్రభాస్ అనుష్క శెట్టి కలిసిన నటించిన మిర్చి సినిమాలోని ఇదేదో బాగుంది పాట ఇష్టమని చెప్పింది.
Advertisement
ఆ పాట తనకి ఇష్టమని, బాగుంటుంది అని ఆమె చెప్పారు. ఆ పాటని పాడుతూ ఆ పాటని ఎంజాయ్ చేస్తూ ఆమె మంచిగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం సుధా మూర్తి కి సంబంధించిన ఈ విషయం వైరల్ అవుతోంది. సాధారణంగా కొంచెం పాతకాలం వాళ్ళకి పాత సినిమాలు పాత సినిమా పాటలు అంటే ఇష్టం కానీ సుధా మూర్తి మాత్రం ప్రభాస్ సాంగ్ ఇష్టమని అనడంతో అంత షాక్ అవుతున్నారు.
Also read: