Advertisement
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాకి జనసేన వీర మహిళలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా రోజా ఓ కంత్రిలాగామాట్లాడుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై రోజా నోరు పారేసుకోవడం అంత మంచిది కాదని వార్నింగ్ ఇచ్చారు. గతంలో కత్తి మహేష్ అలాగే చేస్తే ఆయన గతి ఏమైందో చెప్పాక్కర్లేదు. రోజాధోరణీ ఇలాగే కొనసాగితే తిరుపతిలో అడుగుపెట్టనివ్వమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని హెచ్చరించారు.
Advertisement
Advertisement
తిరుపతిలో ఆకేపాటి సుభాషిని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా అని వ్యాఖ్యానించారు. రుషికొండను బోడిగుండు చేసిన వైసీపీ దోపిడికి అంతులేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను దోచేస్తున్న వైసీపీ నుంచి ఏపీని కాపాడాలనే తపనతో పవన్ ప్రజల్లో వెళ్లి ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ మంత్రులు అందరూ సీఎం వేసే బిస్కేట్లకు ఆశపడి తమ అధ్యక్షుడిపై నోరు పారేసుకుంటున్నారని వీర మహిళలు కౌంటర్ ఇచ్చారు. నెత్తిపై రూపాయి పెడితే పావలాకి కూడా అమ్ముడుపోని రోజా పెద్ద జ్ఞానిలా మాట్లాడుతుందని స్పందించారు. పవన్ కళ్యాణ్ పై తప్పుడు మాటలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. రోజా ధోరణీ ఇలాగే కొనసాగితే వీర మహిళలంతా పొరకలతో కొడతామని హెచ్చరించారు. మరోవైపు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి నడక దారిలో భక్తులకు సీఎం పొటోతో కూడి కర్రలు ఇవ్వడం హాస్యస్పదమన్నారు.