Advertisement
చాలామంది అప్పు చేస్తూ ఉంటారు. డబ్బులు సరిపోకనో లేదంటే సరిగ్గా డబ్బుని వినియోగించకపోవడం ఇలా పలు కారణాల వలన కొందరు అప్పులు చేస్తూ ఉంటారు. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి కనుక చనిపోతే ఆ బకాయిలు ఎవరు చెల్లించాలి అని సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. కార్ కొనుక్కోవడానికి లేదంటే ఇల్లు కొనుక్కోవడానికి, పిల్లలు చదువు కోసమో బ్యాంకుల్లో లోన్ తీసుకుంటూ ఉంటాము.
Advertisement
బ్యాంకులో చాలా రకాల లోన్లు ఇస్తూ ఉంటారు. లోన్లు తీసుకుని మనం మన అవసరాలని తీర్చుకోవచ్చు. అయితే లోన్ టైప్ ని బట్టీ రూల్స్ ఉంటాయి. ఉదాహరణకి మనం హౌసింగ్ లోన్ చూసుకున్నట్లయితే హౌసింగ్ లోన్ తీసుకునే వ్యక్తి చనిపోతే, గ్యారెంటీ ఎవరు ఇచ్చారు చూసుకుంటారు. ఒకవేళ ఎవరూ లేకపోతే వారసుల్ని చూస్తారు. ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లైతే ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుంటుంది బ్యాంకు. ఒకవేళ ఇన్సూరెన్స్ కింద తక్కువ డబ్బులు వస్తే ప్రాపర్టీ డబ్బులు తీసుకుంటారు.
Advertisement
ఒకవేళ ఎక్కువ ఉంటే వారసులకి ఇచ్చేస్తారు. ఏదో విధంగా హోమ్ లోన్ ని బ్యాంకు కలెక్ట్ చేసుకుంటుంది. హోమ్ లోన్ ని సెక్యూరిడ్ లోన్ అని చెప్పొచ్చు. అలానే కార్ లోన్ విషయానికి వస్తే ఇక్కడ సేమ్ హోమ్ లోన్ లానే ముందు వారసులని అలా చూస్తారు ఒకవేళ ఎవరైనా ఆ కారుని తీసుకుని డబ్బుని చెల్లించవచ్చు. ఒకవేళ కారు వద్దనుకుంటే జప్తు చేసి వచ్చిన డబ్బుల్ని ఇస్తారు. అదే సెక్యూరిటీ లోన్స్ కాని వాటిని అయితే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ డబ్బుల్ని బ్యాంకులు తీసేసుకుంటాయి. ఒకవేళ కనుక ఇన్సూరెన్స్ తీసుకోలేకపోయినట్లైతే బ్యాంకులు వారుసులని అడుగుతారు. కానీ వాళ్లు బాధ్యత వహించక్కర్లేదు. వారు బాధ్యులు కారు. ఒకవేళ వారసులు ఇవ్వకపోయినా ఫోర్స్ చేయకూడదు.
Also read: