Advertisement
నారా లోకేష్ విదేశాల్లో చదువుకున్నాడు. బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నాడు లోకేష్. తర్వాత రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. లోకేష్ విద్యార్థిగా ఉండేటప్పుడు స్నేహితులతో కలిసి తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసిపి దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది మొన్నటికి మొన్న సీఎం జగన్ సైతం లోకేష్ పై కామెట్స్ చేశారు సీఎం అయితే స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవాడు ఒకడు అంటూ సెటైర్ కూడా వేశారు. దీని మీద స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు లోకేష్.
Advertisement
లోకేష్ తాజాగా తన లవ్ ట్రాక్ గురించి చెప్పారు విద్యార్థులు యువతతో లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించడం జరిగింది. విద్యార్థుల ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక విద్యార్థిని ఫస్ట్ క్రష్ ఎవరు అని అడిగింది. అలానే బ్రాహ్మణితో పెళ్లి ప్రతిపాదన ముందుగా ఎవరు తీసుకొచ్చారు అని కూడా ఒకరు అడిగారు.
Advertisement
ఆ విషయం చెప్తే మావయ్యకి కోపం వస్తుందని.. బాలకృష్ణని ఉద్దేశించి లోకేష్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే లోకేష్ కి లవ్ ట్రాక్ ఉందని భావించారు. లోకేష్ ప్రేమ గురించి చెప్తూ నాదీ బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అన్నారు. కానీ మావయ్య దగ్గర అంత సాహసం చేయలేదు. మా అమ్మ నాన్నతో బయటకి వెళ్ళినప్పుడు పెళ్లి టాపిక్ వచ్చింది. మరి నువ్వేమంటావు అని లోకేష్ ని అడిగారట. నేను ఎస్ చెప్పానని లోకేష్ చెప్పారు. అలానే ఆమె కూడా పెళ్లికి ఒప్పుకుంది ఇలా ఫైనల్ గా వెళ్లి జరిగింది అని లోకేష్ చెప్పారు.
Also read: