Advertisement
జీవితంలో ఒక వ్యక్తికి అత్యంత సన్నిహితులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ వ్యక్తి భార్య మరియు స్నేహితులే. స్నేహితుడు, భార్య ఒకేసారి ఒక వ్యక్తిని మోసం చేస్తే ఎలా నాశనం అయిపోతుందో చెప్పడానికి దినేష్ కార్తీక్ జీవితం నిలువెత్తు నిదర్శనం. భారత క్రికెటర్లు దినేష్ కార్తీక్, మురళీ విజయ్ ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న వారిద్దరు కార్తీక్ భార్య నిఖితా వల్ల శత్రువులుగా మారారు. మురళీ విజయ్ చేసినా ద్రోహనికి దినేష్ కార్తీక్ మాత్రం మనసున్న వ్యక్తిగా తన మంచి వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.
Advertisement
ప్రేమ లేనిచోట బంధం నిలబడదని తెలుసుకున్న దినేష్ కార్తీక్ పడి లేచిన కెరటంలా ఈ ప్రపంచానికి కొత్త ప్రేమ కథను పరిచయం చేశాడు. స్నేహం ముసుగులో తనను మోసం చేసిన మురళివిజయ్ కి దినేష్ కార్తీక్ ఎలాంటి పాఠం నేర్పించాడో ఇప్పుడు తెలుసుకుందాం. దినేష్ కార్తీక్ క్రికెటర్గా తనను తాను నిరూపించుకునే రోజులవి.. అండర్ 19 లో చోటు దక్కించుకున్న దినేష్ కార్తీక్ తమిళనాడు తరఫున వరుసగా విజయాలతో దూసుకుపోతున్నాడు. అలా ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో చోటు దక్కించుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహారించే దినేశ్ కార్తీక్, 2007లో తన 21 ఏళ్ల వయసులో తన చిన్ననాటి స్నేహితురాలు నికితాను పెళ్లి చేసుకున్నాడు.
దినేశ్ కార్తీక్, నికితా ఇద్దరూ తండ్రులు స్నేహితులు కావడంతో ఈ ఇద్దరూ చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. దినేష్ కార్తీక్ నిఖిత అంటే ఇష్టం అని ఆయన తండ్రికి తెలియజేయడంతో ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి క్రికెటర్ మురళీ విజయ్ కూడా హాజరయ్యాడు. ఒకే రాష్ట్రనికి చెందిన దినేశ్ కార్తీక్, మురళి విజయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ తో ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు.
Advertisement
అప్పటికే పెళ్లయిన దినేష్ కార్తీక్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ లకి తన భార్య నికితాతో కలిసి వెళ్లేవాడు. దినేష్ కార్తీక్ తో పాటు మిగతా వారు ఉంటున్న హోటల్ కూడా భర్త వెంబడి వెళ్ళిపోయేది నిఖితా. దినేష్ మరియు నికిత ఇద్దరు తమ కెరియర్ మంచిగా ఎదగాలని కొన్నాళ్లపాటు పిల్లల్ని వద్దనుకున్నారు. దినేష్ కి మురళి విజయ్ మంచి స్నేహితుడు కావడంతో ఇంటికి వచ్చి వెళుతూ ఉండే క్రమంలో దినేష్ భార్య నికితాతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం దినేశ్ కార్తీక్ కి తెలియడంతో నికిత చేసిన తప్పుకి ఇరు కుటుంబ సభ్యులకు బలవంతంగా మనుషుల్లో కలిపినా మనసులో కలవు అని పెద్దలకు తెలియజేసి నికితాకి విడాకులు ఇచ్చాడు. ఇక నికిత భర్త నుంచి విడాకులు తీసుకున్న నెలరోజుల తర్వాత గర్భవతి అని తెలిసింది. ఆ గర్భానికిి తనే కారణం అని తెలుసుకున్న మురళి విజయ్ నికితాను వివాహం చేసుకున్నాడు. ఒకవైపు ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకున్న దినేష్ భార్య మరియు స్నేహితుడు ఇద్దరూ చేసిన మోసంతో డిప్రెషన్ లోకి వెళ్లి తాగుడుకు బానిసై క్రికెట్కు సరిగ్గా ఆడకపోవడంతో తమిళనాడు క్రికెట్ జట్టు నుంచి కూడా దినేష్ కార్తీక్ ని తొలగించారు. అలా భార్య మరియు స్నేహితుడు చేసిన మోసానికి దినేష్ కార్తీక్ క్రికెట్ కెరియర్ నాశనం అయ్యింది.
ఇప్పుడే కొంతమంది ప్రముఖుల సలహాతో లెజెండరీ ప్లేయర్ కిరణ్ మోరే సలహాతో తిరిగి క్రికెట్లో కఠోర శిక్షణ తీసుకున్నాడు. ఎందుకంటే దినేష్ కార్తీక్ కి క్రికెట్ తప్ప మరొక పని తెలియదు. ఇంతకుముందు క్రికెటర్లకు దినేష్ కార్తీక్ తో కనిపించినా అతని భార్య ఆ తర్వాత మురళి విజయ్ తో కనిపించడంతో ఆ ఒత్తిడితో కూడా ఐపీఎల్ మ్యాచ్లు సరిగా ఆడలేకపోయేవాడు. కానీ కిరణ్ మోరే దినేష్ కార్తీక్ క్రికెట్ కెరీర్కే కాదు లైఫ్ కూడా మంచి కోచ్గా వ్యవహరించేవారు. కిరణ్ మోరే సలహాలతో తనని తాను మంచి ఉన్నతమైన వ్యక్తిగా మలుచుకున్నాడు దినేష్ కార్తీక్. ఐపీఎల్ లో సత్తా చాతి ఏకంగా కోల్కత్తా టీమ్ కెప్టెన్గా ఎదిగాడు.
ఇక ఐపీఎల్ లో సక్సెస్ఫుల్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు దినేష్. అప్పుడే అతని జీవితంలోకి మెరుపులాగా వచ్చింది భారత స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్. పెళ్లికి ముందు క్రికెటర్లు అంటే అయిష్టంగా ఉండే దీపికా, దినేశ్ కార్తీక్ వ్యక్తిత్వాన్ని చూసి మనసు పారేసుకుంది. ఒకే కోచ్ దగ్గర ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకున్న ఈ ఇద్దరూ ప్రేమించుకొని 2015 ఆగస్టు 18న దీపిక కోరిక మేరకు క్రిస్టియన్ పద్ధతి లో ఆగస్టు 20న హిందూ పద్ధతుల్లో ఇలా ఈ జంట రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు.
ఒకసారి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న దినేష్ కు దీపిక భార్యగా అండగా నిలవడమే కాక ఎనలేని ప్రేమను పంచింది. ఒకసారి ఇంగ్లాండ్ టూర్ కి దినేష్ మరియు మురళి విజయ్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. కాని ఇద్దరూ కలిసి ఒకచోట నిలబడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అంతేకాకుండా తన మాజీ భార్య నికిత స్టేడియంలో కనిపించినా పక్కకు తలదించుకొని వెళ్ళిపోయేవాడు. జీవితంలో ఎంతో మోసపోయిన దినేష్ కార్తీక్ తన జీవితాన్ని మరియు కెరీయర్ని ఎంతో గొప్పగా మలుచుకున్నాడు .