Advertisement
Chiranjeevi : చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీకి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని పేరు. ఒక సాధారణ నటుడుగా నట ప్రస్థానాన్ని ప్రారంభించి స్వయంకృషితో పట్టుదలతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొని మెగాస్టార్‌గా ఎదిగారు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన సినీ ప్రయాణంలో ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ అందించారు. ఇక ఇండస్ట్రీలో హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు.
Advertisement
ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ వయసులో కూడా అదే జోష్ తో సినిమాల్లో నటిస్తూ ఇతర హీరోలకు సైతం మంచి కాంపిటేషన్ గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా విడుదలైన భోళా శంకర్ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనితో మెగాస్టార్ కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
1978లో పునాది రాళ్లు సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించినా చిరంజీవి ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. 1983 విడుదలైన ఖైదీ చిత్రంతో స్టార్ నుంచి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరు. ఇక ఖైదీ చిత్రం మొదలుకుని 2002 లో వచ్చిన ఇంద్ర వరకు సుమారు 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీ హిట్స్ తో వార్తల్లో నిలిచారు. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఖైదీ నుంచి ఇంద్ర సినిమాల మధ్యలో చిరంజీవి సినిమాలు సూపర్ హిట్స్ చిత్రాలుగా నిలవడం విశేషం.
అంటే.. ఏడాదికి ఒక ఇండస్ట్రీ హిట్ చొప్పున ఆరేళ్ళ పాటు ఆరు ఇండస్ట్రీ హిట్స్ తో చిరు సరికొత్త రికార్డుని క్రియేట్ చేశారు. పసివాడి ప్రాణం (1987), యముడికి మొగుడు (1988), అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989), జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) గ్యాంగ్ లీడర్ (1991), ఘరానా మొగుడు(1992) చిత్రాలతో వరుసగా ఆరు సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్స్ అందించారు. ఇలా వరస ఇండస్ట్రీ హిట్స్ దక్కడం అనేది చిరంజీవి కెరీర్ లోనే అత్యంత అరుదైన రికార్డుగా చెప్పుకోవాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ప్రియుడు దూరం అవ్వడంతో.. ఆమె షాకింగ్ నిర్ణయం.. వరుస విషాదాలు..!