Advertisement
అత్త ఒక ఇంటి కోడలే.. ఈ సామెత చెప్పుకోవడానికే గానీ.. నిజ జీవితంలో మాత్రం కోడలు వచ్చినప్పుడు అత్తగారికి ఎక్కడలేని పెత్తనం వస్తుంది. అత్తగారి పెత్తనాన్ని సహించలేని ఓ కోడలు తను అత్తగారి ఇంటిలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని స్వయానా అత్తగారికి ఉత్తరం రాసింది. కోడలు అత్తకి రాసిన ఉత్తరం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ రూల్స్ పెట్టకండి అత్తయ్య అంటూ కోడలు రాసిన ఉత్తరం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇంతకీ అసలు కోడలు అత్తగారికి ఏమని లెటర్ రాసిందో ఇప్పుడు చూద్దాం..
Advertisement
ప్రియాతి ప్రియమైన అత్తగారు మీకు నమస్కారం.. నేను కోడలుగా మీ ఇంటిలో అడుగుపెట్టగానే మీరు నాకు చెప్పిన మొదటి మాట నా కొడుకును బాగా చూసుకో అమ్మ అని. నేను మీ కోడలుగా మీ ఇంటిలో అడుగు పెట్టాను. అసలు ఎవరు ఎవరి ఇంటికి వచ్చారు..? నన్ను మీకు అప్పగించేటప్పుడు మా అమ్మ నాన్న మీకు ఏం చెప్పారు. మా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అమ్మ అని మీకు చెప్పి పంపించారు. కానీ మీరు చేసేది ఏంటి..? మీ కొడుకు రాజా కా బేటా.. నేను మాత్రం పనిమనిషిగా పనులు చేయడానికి వచ్చానా..
నా కొడుకుని బాగా చూసుకో అమ్మ అని మీరు అంటారు. కానీ మీ కొడుకు మాత్రం టీవీ ముందు కూర్చుంటే సమయానికి కాపీ, భోజనం పెట్టడం ఇదేనా బాగా చూసుకోవడం అంటే…? అతను ఆఫీస్ నుంచి రాగానే ఆయన కాళ్లకు ఉన్న సాక్సులు తీసి బయట పెట్టడం. విడిచిన బట్టలు వాషింగ్ మిషన్ లో వేయడం ఇదేనా నా పని ఆఖరికి ఆయనకు వేడి నీళ్లు కూడా నేనే పెట్టాలి. ఆ తర్వాత భోజనం పెట్టడం ఇంటిడి చాకిరీ చేయడం నా వంతు అయిపోయింది. మీ కొడుకు మాత్రమే కాదు నేను కూడా ఆఫీస్ కి వెళ్ళి కష్టపడి ఇంటికి తిరిగి వస్తున్నాను. అలా అని ఆయనకు నేను సేవలు చేయను అని అనటం లేదు. కాస్త నా పనిలో సాయం చేయమని మీరు చెప్పకపోయినా పర్వాలేదు. కానీ.. తన పని తను చేసుకోమని ఒక్కసారైనా మీ ముద్దుల కొడుకుకి చెప్పారా ..
అసలు చెప్పరు.. ఎందుకంటే కోడలు అంటే మీ ఇంటికి ఫ్రీ గా వచ్చిన పనిమనిషి కాబట్టి. అత్తగారు ఇక మీరు నాకు చెప్పే రెండో మాట ఏంటంటే..? నా కొడుకు సంగతి నాకు బాగా తెలుసు. ఇక నా కొడుకు గురించి నీకేం తెలుసు అని నన్ను అంటారు. హలో అత్తగారు.. మీ కొడుకుని మీరు పెంచి పెద్ద చేశారు. బాగా చదివించి ప్రయోజకుడిని చేశారు. కానీ నేను రోజు అతనితో పడక షేర్ చేసుకుంటాను. ఈ అబ్బాయి గురించి మీకు తెలియని ఎన్నో విషయాల గురించి నాకు తెలుసు. అతని ఆలోచనల తీరు ఎలా ఉంటుందో నీ కొడుకు గురించి మిగిలిన వారి కంటే నాకే బాగా తెలుసు. మీ కొడుకు గురించి అంతా మీకే తెలుసు అనుకుంటే ప్రపంచంలో మీ కన్నా పెద్ద అమాయకులు మరొకరు ఉండరు.
ఇక అబ్బాయి మంచి కొడుకు, మంచి తండ్రి, మంచి ఉద్యోగం కావచ్చు. కానీ మంచి భర్త అని మీరు ఎలా చెప్పగలరు.? కనీసం మీ అబ్బాయి గురించి నేను ఏదైనా ఫిర్యాదు చేస్తే నా మాట మీరు కొంచమైనా వినాలి. మీ కొడుకుతో మాట్లాడి సర్థి చెప్పాలి. ఆయన మీ మాట విని మారితే మొదటిగా సంతోషపడే వ్యక్తిని నేనే.. నేను సంతోషంగా ఉంటే మీ ఇల్లంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అలాకాకుండా మీరు నా కొడుకు అలా చేయడు, వాడి గురించి నాకు తెలుసు అంటూ మీరు సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వకండి. ఇక మూడవది.. మీరు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఏంటంటే..? నా కొడుకు కష్టపడి ఇంటికి వస్తాడు. వాడికి నువ్వు అన్ని సపరియాలు చేయాలి అంటారు. ఇంట్లో నేను చేసే చాకిరి కంటే మీ అబ్బాయి చేసే పనులు పెద్ద గొప్పవి కావు.
Advertisement
నేను ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ఇంటిలో గొడ్డు చాకిరి చేస్తున్నాను. ప్రతిసారి మీరు మీ కొడుకు కంఫర్ట్స్ గురించి మాట్లాడతారు. మరి నా సంగతి ఏంటి..? నేనేమన్నా ఖాళీగా ఉంటున్నానా. కాసేపు రెస్ట్ తీసుకుందామంటే ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. ఇక పిల్లలు పుట్టాక రెస్ట్ అనే పదానికే నా జీవితంలో చోటు లేకుండా అయిపోయింది. ఇక నాలుగో పాయింట్.. ప్రియమైన అత్తగారు నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలో మీరు ఓ మాట అన్నారు. ఇంటిలో రూల్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని. ఇంతకీ అసలు రూల్స్ ఏంటి చెప్పండి. నేను ఏమన్నా ఇంటికి వచ్చిన ఖైదీనా.. మన ఇల్లు ఏమన్నా చర్లపల్లి జైలా. నా రూల్స్ మా ఇంటి పద్ధతులు అంటూ కొత్తగా చెప్తారు. అందరం కలిసి తలా ఒక పని చేస్తే అందరూ రూల్స్ ఒకటే. కానీ కోడలు మాత్రమే అన్ని చేయాలి. కానీ మీ కొడుకు మాత్రం హాయిగా టీవీ ముందు కూర్చుని రెస్ట్ తీసుకుంటుంటే.. నేను మాత్రం హోటల్‌లో సర్వర్ లా అన్ని ఆయన కాళ్ళ ముందు తీసుకెళ్లాలి. ఆయన చేయగలిగే పనులు ఆయన చేసుకోవాలని మీరు అతనితో చెప్పాలి అత్తయ్య. అంతేగాని రూల్స్ పెట్టి జైలర్ల మీరు నాపై పెత్తనం చేస్తానంటే నాకు నచ్చలేదు. ఇప్పటికీ ఆ మాటలు వింటుంటే మీ మీద నాకు కాస్త గౌరవం తగ్గుతుంది. ఇంకా చివరిగా మీరు నా నిర్ణయాలలో కూడా వేలు పెడుతూ ఉంటారు. నాకు ఏం కావాలి నేను ఏం చేయడం అనేది కూడా మీరే చెప్తూ ఉంటారు ఎందుకు..? ఏదైనా కొనాలి అంటే నా అనుభవంతో చెబుతున్నానని మీ నిర్ణయాన్ని బలవంతంగా నాపై రుద్దుతారు. నేను కొనకపోతే మీ కొడుకు వైపు సీరియస్ గా చూస్తారు.. ఆయనేమో నాపై సీరియస్ గా చూస్తారు .. ?
మీ నిర్ణయాలను గౌరవిస్తాను. కానీ నా నిర్ణయాలు నేను ప్రేమిస్తాను. నాకు కూడా కొన్ని వ్యక్తిగత కోరికలు, ఇష్టాలు ఉంటాయి . వాటికి కూడా మీరే అడ్డుపడుతున్నారు అత్తయ్య. నేను కూడా తప్పులు చేసి ఉండవచ్చు కాదని అనను. ఈ లోకంలో ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ గా ఉండరు. ఆఖరికి మీ కొడుకు తో సహా. ప్రతి వ్యక్తులలో ఏదో ఒక లోపం ఉంటుంది. కాబట్టి కోడళ్ళకి మీరు రూల్స్ పెట్టకండి. నీ కొడుకే బంగారు కొండ అని మీరు అనుకోవద్దు. అమ్మ నాన్న కూడా నన్ను అలానే అనుకుంటారు. కాబట్టి ప్రియమైన అత్తగార్లు కోడళ్ళకు స్వేచ్ఛనివ్వండి. కొడుకు సంసారంలో అతిగా వేలు పెట్టకండి. మేము తప్పులు చేస్తే సూచించండి . మా పద్ధతిని మార్చుకుంటాం. వీలైతే సాయం చేయండి. లేకపోతే మమ్మల్ని మా దారినా వదిలేయండి. అంతేకానీ నా కొడుకు మాత్రం బంగారం, కోడలు దెయ్యం అన్నట్లుగా దయచేసి చూడకండి.
నేను రాబోయే కాలంలో అత్తను అవుతాను. కానీ ఈ అనుభవంతో నా కోడల్ని కూతురులా చూసుకుంటానని చెబితే అది అతి అవుతుంది. దెయ్యంలా మాత్రం వెంటాడను. కొడుకుని కోడల్ని ఇద్దరినీ సమానంగా చూసుకుంటాను. ఈ ఉత్తరం చదివినాక మీరు కానీ ఫీల్ అయినట్లయితే నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఇట్లు మీకు ఇష్టం లేని కోడలు. ఇది.. ఓ అత్తగారికి ఓ కోడలు రాసిన లేఖ. మరి కోడలు రాసిన ఈ లేఖపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని…
ప్రియుడు దూరం అవ్వడంతో.. ఆమె షాకింగ్ నిర్ణయం.. వరుస విషాదాలు..!