Advertisement
Allu arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పుష్ప బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డుని దక్కించుకున్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు..
Advertisement
అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి. అయితే.. అంతకు ముందు రెండు సినిమాల్లో బాలనటుడిగాను, చిరంజీవి డాడీలో చిన్న పాత్రలో కనిపించాడు. ఇకపోతే.. 21 ఏళ్ల వయసులో రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇకపోతే బన్నీ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు యానిమేటర్‌గా, డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ సమయంలో అల్లు అర్జున్ మొదటి జీతం ఎంతో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. యానిమేటర్ డిజైనర్ గా పనిచేసినందుకు అల్లు అర్జున్ మొదటి జీతంగా రూ.3,500 అందుకున్నారట. ఒకప్పుడు అతి తక్కువ పారితోషకం అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు దక్షిణ భారత చలనచిత్రంలో అత్యంత డిమాండ్ ఉన్న మరియు అత్యధిక పారితోషికం పొందిన నటులలో ఒకరిగా కొనసాగుతున్నారు
Advertisement
ఇక అల్లు అర్జున్ ఆస్తులు విలువ ఎంత అంటే.. ?
టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ నికర విలువ దాదాపు రూ.600 కోట్లు అని కొన్ని రిపోర్టుల ప్రకారం సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు అర్జున్ రెమ్యూనరేషన్ కూడా కోట్లలో ఉంటుంది. పార్లే అగ్రోఫ్రూటీ, రెడ్ బస్, కోల్గేట్ మాక్స్ ఫ్రెష్, లాట్ మొబైల్స్‌కు వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు బన్నీ. అందుకు గాను ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక స్టైలిష్ స్టార్ కి కార్లంటే చాలా ఇష్టమట. రేంజ్ రోవర్ వోగ్ ధర రూ. 2.50 కోట్లు, వానిటీ వ్యాన్ రూ. 7 కోట్లు, BMW X5 రూ. 80 లక్షలు, జాగ్వార్ ఎక్స్‌జెఎల్ రూ. 1.20 కోట్లు, ఆడి ఏ7 రూ. 86 కోట్ల విలువ చేసే కార్లు కలెక్షన్స్ ఆయన దగ్గర ఉన్నాయట. ఇక నార్సింగిలోని అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్, ఆశీర్వాదం, జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారట అల్లు అర్జున్. మొత్తానికి అల్లు అర్జున్ దగ్గర దాదాపు 600 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
RRR సినిమా 2022 లో వచ్చింది మరి 2021 అవార్డులు గా ఎందుకు వచ్చిందంటే ?
సూర్య సినిమాకి అవార్డు రాకపోవడం వెనుక దాగి ఉన్న కథ ఇదేనా ?
మరణించిన వారి అస్థికలను “గంగా నది” లో కలపడానికి గల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా…?