Advertisement
ఒక కథను తెరపై అద్భుతంగా చూపించాలి అంటే దర్శకుడు కష్టమే ఎంతో ఉంటుంది. దర్శకులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టిన కొంతమంది మాత్రమే అగ్రస్థాయి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు. సినీ పరిశ్రమలో దర్శకుడుగా నిలతుక్కోవడం అనేది అంత ఈజీ కాదు. ఏళ్ళకి ఏళ్ళు ప్రయత్నాలు చేసినా కానీ అవకాశం దక్కుతుంది అనే గ్యారెంటీ కూడా లేదు.
Advertisement
ఒకవేళ సినిమాలు తీసే అవకాశం వచ్చినా స్టార్ హీరోలతో సినిమా తీసే అవకాశం వస్తుందా అనడానికి కూడా గ్యారెంటీ ఉండదు. కానీ కొంతమంది దర్శకులకు కెరియర్ ప్రారంభంలోనే బడా హీరోలతో చిత్రాలు చేసే అదృష్టం దక్కుతుంది. అలా పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా హిట్ ని సొంతం చేసుకోలేని దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం
#1. మెహర్ రమేష్ :
చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో దర్శకత్వంలో సినిమా అవకాశాలు వచ్చిన మెహర్ రమేష్ ఒక హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ‘బిల్లా’ సినిమాతో యావరేజ్ సక్సెస్ కి సొంతం చేసుకున్నాడు. ఇంకా ఇటీవల విడుదలైన బోళా శంకర్ కూడా మెహేర్ రమేష్ కెరియర్లో ఫ్లాప్ గా మిగిలింది.
#2. రమేష్ వర్మ :
Advertisement
సూర్య రాక్షసుడు అనే డబ్బింగ్ సినిమా, అలాగే రైడ్ అనే సినిమాలతో యావరేజ్ రిజల్ట్స్ అందుకున్నాడు రమేష్ వర్మ. మాస్ మహారాజా రవితేజ తో చేసినా వీర, ఖిలాడి కూడా రమేష్ వర్మ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచాయి.
#3. మల్లికార్జున్ :
కళ్యాణ్ రామ్ తో అభిమన్యు, కళ్యాణ్ రామ్ కత్తి, షేర్ వంటి సినిమాలలో దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు మల్లికార్జున్. ఇక ఇతనికి కూడా ఒక్క సక్సెస్ అయినా ఖాతాలో పడలేదు.
#4 రాధా కృష్ణ కుమార్ :
గోపీచంద్ తో చేసిన ‘జిల్’ యావరేజ్ రిజల్ట్ ని సొంతం చేసుకున్నా.. ప్రభాస్ తో చేసిన ‘రాధే శ్యామ్’ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
#5.సురేష్ వర్మ :
ఎన్టీఆర్ తో సుబ్బు, రాజశేఖర్ తో శివయ్య చిత్రాలు తీసినా సురేష్ వర్మ కూడా సక్సెస్ ని అందుకోలేకపోయాడు.
#6. హర్షవర్ధన్:
బాలయ్య బాబుతో విజయేంద్ర వర్మ, కళ్యాణ్ రామ్ తో హరే రామ్ వంటి పెద్ద సినిమాలు చేశాడు హర్షవర్ధన్. కానీ అతని ఖాతాలో కూడా ఒక్క సక్సెస్ పడలేదు.