Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్ణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖపట్నంలో చేపట్టిన నెరవ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆల్ దీక్షను పోలీసులు భగ్నం చేసేందుకు రావడంతో ఆయన ఓవరాక్షన్ చేశాడు. తనకు వైద్యం అవసరం లేదని.. కేజీహెచ్ దగ్గర పోలీసులతో గొడవకు దిగారు. అడ్డుకోబోయిన సీఐ కాలర్‌ను పట్టుకున్నాడు కేఏ పాల్. పోలీసులపై అరుస్తూ కేకలు పెడుతూ నానా హంగామా చేశాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నాను అని వదిలిపెట్టాలని గొడవకు దిగాడు పాల్.
Advertisement
Advertisement
సీఐ, ఎస్ఐ బచ్చగాళ్లంటూ.. నేను ఎవరిని కే.ఏ.పాల్ ని.. డైరెక్ట్ డీజీపీతోనే మాట్లాడుతాను.. సీఐతో మాట్లాడే రేంజ్ కాదని పేర్కొన్నారు. కేఏ పాల్ చేస్తున్న దీక్షాశిభిరం నుంచి ఆయనను బలవంతంగా పోలీసులు తరలించారు అంబులెన్స్ ఎక్కించి కేజీహెచ్ కు తీసుకుపోయారు ఆస్పత్రి లోపలికి వెళ్లకుండా గేటు దగ్గరే కేఏ పాల్ పోలీసులతో గొడవకు దిగారు ఆరోగ్యంగా ఉన్నతలను ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు పోలీసులను తనను చంపేందుకే ఇలా చేస్తున్నారంటూ విమర్శించారు కేఏ పాల్.
అనంతరం మీడియాతో మాట్లాడారు కేఏ పాల్. నిరాహార దీక్ష విరమణ పై యూటర్న్ తీసుకున్నట్టు చెప్పాడు దీక్షను కొనసాగిస్తున్నట్టు ప్రకటన చేశాడు కేఏ పాల్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులను కల్వనున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అంశంలో సత్వర న్యాయం కావాలంటూ ఏపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.