Advertisement
Vijay Devarakonda Kushi Review in Telugu: సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన తాజా సినిమా ఖుషి. నిన్ను కోరి, మజిలీ చిత్రాల డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి సినిమాపై మొదటి నుంచి అంచనాలు విపరీతంగా పెరిగాయి. అందుకు తగినట్లుగానే సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఖుషి ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆటు రౌడీ ఫ్యాన్స్, ఇటు సమంతా అభిమానులు సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 1న థియేటర్లలోకి అడుగు పెట్టింది ఖుషి సినిమా.
Advertisement
Kushi Movie Story: కథ మరియు వివరణ :
కథ కాశ్మీరులో మొదలవుతుంది. బురఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి ఇది నా పిల్ల అని ఫిక్స్ అయిపోతాడు. విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే బేగం ప్రేమలో పడతాడు. విప్లవ్ అనూహ్య పరిస్థితుల్లో బ్రాహ్మిన్ అయిన ఆరాధ్య సమంత బేగంగా మారాల్సి వస్తుంది. చంద్రరంగం (మురళీ శర్మ) గారి అమ్మాయి ఆరాధ్య ప్రేమను పొందడానికి వెళ్లే సత్యం (సచిన్ కేడేకర్) గారి కొడుకు విప్లవ్ పెద్ద పోరాటమే చేస్తాడు. ఆరాధ్య ప్రేమను సాధిస్తాడు. ఆరాధ్యది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. విప్లవ్ ది నాస్తిక కుటుంబం కావడంతో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు. ఈ ప్రేమ పోరాటంలో పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెద్దలను ఎదిరించి మరి ఆరాధ్య, విప్లవ్ లు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ.
Advertisement
ఆరాధ్య, విప్లవ్ లు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తారు… వాళ్ళు విడిపోతారా అనేదానికోసం సినిమా చూడాల్సిందే. ఎప్పుడూ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివనిర్వాన ఈసారి అది ఎక్కడో మర్చిపోయినట్టు ఉంది. సినిమా కాశ్మీర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అసలు పాయింట్ మొదలవుతుంది. జనరల్ గా అందరూ అనుకున్నట్లయితే పెళ్లి తర్వాత ఇది చేద్దాం. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. 2 గంటల 40 నిమిషాలు ఉన్న ఈ సినిమా అక్కడక్కడ బోర్ కొట్టిన పర్లేదు అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేస్తుంది. సినిమాలో ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
విజయ్ దేవరకొండ, సమంత
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
లోకేషన్లు
మైనస్ పాయింట్స్
ఎడిటింగ్
కథనం
రేటింగ్ 2.5/5