Advertisement
నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన పోషించని పాత్ర అంటూ లేదు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉందంటే దానికి ప్రధాన కారకుడు సీనియర్ ఎన్టీఆర్ అనే చెప్పవచ్చు. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ కు నటన అంటే పిచ్చి అట. నటన కోసం ప్రాణాలను లెక్క చేయలేదంటే ఆయనకు కళామ్మతల్లి మీద ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా చేసే సమయంలో కళ్లు పోతాయని తెలిసి కూడా ఆ పాత్రలో నటించారట.
Advertisement
Advertisement
.సీనియర్ ఎన్టీఆర్ హీరోగా 1956లో వచ్చిన సినిమా చిరంజీవులు. ఇందులో జమున హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ అందుడిగా నటించారు. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో , ఎన్టీఆర్ అందుడిగా కనిపించడం కోసం కళ్ళకు తెల్లని పదార్థం పెట్టారట. ఇక ఈ పాత్రలో పూర్తిగా గుడ్డివాడిగా ఎన్టీఆర్ కనిపించారు. ఆయన బ్రేక్ సమయంలో కూడా ఆ కళ్ళకు పెట్టిన వాటిని తీసేవారు కాదట.
అలా సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి కళ్ళు పోయే పస్థిస్తితి ఏర్పడిందట. అయినా సినిమా కోసం ఆయన ఈ పాత్ర చేశారట. ఈ సినిమాను హిందీ చిత్రం నుంచి రీమేక్ చేసి తెలుగులో అనేక మార్పులు చేసి చిరంజీవులు సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు రాఘవయ్య. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.