• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » అసలు నాగార్జున ఈ సినిమా ఎందుకు రీమేక్ చేస్తున్నారు ? రీమేక్ చేసేలా ఇందులో ఏముంది ?

అసలు నాగార్జున ఈ సినిమా ఎందుకు రీమేక్ చేస్తున్నారు ? రీమేక్ చేసేలా ఇందులో ఏముంది ?

Published on September 2, 2023 by Mounika

Advertisement

 నాలుగు తరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని వెళుతున్న స్టార్ హీరోల్లో నాగార్జున ఒకరు. ఈ వయసులో కూడా గ్లామర్ లో కొడుకులకు పోటీగా యంగ్ హీరోలా కనిపిస్తూ కుర్ర హీరోలకు సైతం నాగ్ కాంపిటేషన్ గా నిలుస్తున్నారు. బంగార్రాజు సినిమాతో సక్సెస్ ని అందుకున్న నాగార్జున ఆ తర్వాత అడపా తడప కొన్ని సినిమాల్లో కనిపించిన కూడా  ఆయనకు అంతగా సక్సెస్ తీసుకురాలేకపోయాయి. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా నాగార్జున ప్రస్తుతం రీమేక్  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

 

ఆగష్టు 29 న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా  ఆయన రాబోయే సినిమాలపై అప్డేట్ వచ్చింది. నాగార్జున నటించబోయే  ఆ సినిమాకు గాను ‘నా సామి రంగ’ అనే టైటిల్ ఖరారు చేశారు. . ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. . ఈ సినిమాకు సంబంధించిన  గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన “పొరింజు మరియమ్ జోస్” సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Advertisement

2019లో విడుదలైన  పొరింజు మరియమ్ జోస్  మూవీకి గాను జోషి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జోజు జార్జ్, నైలా ఉష, చెంబన్ వినోద్ జోస్ లు టైటిల్ రోల్స్ ను పోషించారు. చర్చి పండుగలో జరిగిన ఒక సంఘటన ఈ ముగ్గురి జీవితాలను ఎలా మార్చింది అనేది స్టోరీ. ఇక సినిమా కథలో కొన్ని మార్పులు జత చేసి  తెలుగులో నా సామి రంగ అనే టైటిల్ తో తెరకెక్కించబోతున్నారు.

 నాగార్జున ఇలా రిమేక్ చిత్రం చేయడంపై నెటిజెన్స్  భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ హీరోలు రీమేక్ లు మానేసి కొత్త కథల ద్వారా సినిమాలు తీయాలని కామెంట్ చేస్తున్నారు. అలాగే రీమేక్ చేయడానికి ఈ కథలో అసలు అంతగా ఏం ఉందని చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.  అయితే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన  గ్లింప్స్ ని  చూసినా నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కచ్చితంగా  విజయం సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయం కూడా అప్డేట్ కాలేదు.  ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజ్ కానుందని సమాచారం వినిపిస్తుంది.

Also Read :

Pawan Kalyan OG Movie : పవర్ స్టార్.. ‘ఓజీ’ టీజర్ అదిరిపోయింది..

మహేశ్ బాబు ‘అతడు’ లో డిలీట్ చేసిన ఈ 5 సీన్స్ చూస్తే వావ్ అనాల్సిందే..!

ఎక్కువ సినిమాలు రీమేక్ చేసిన టాలీవుడ్ హీరోలు

 

Related posts:

మన స్టార్ హీరోల కూతుళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ? ఒక వెలుగు వెలిగి..ఆ తర్వాత కనుమరుగైన టాలీవుడ్ హీరోలు Avatar-2 Movie Review in Telugu: అవతార్ 2 రివ్యూ og-teaserPawan Kalyan OG Movie : పవర్ స్టార్.. ‘ఓజీ’ టీజర్ అదిరిపోయింది..

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd