Advertisement
కోలివుడ్ ప్రముఖ సీనియర్ నటుడు ఆర్ ఎస్ శివాజీ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. వయోభారం కారణంగానే ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. ఆయన మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. కోలీవుడ్ పెద్ద పెద్ద బ్యానర్స్ అయిన సన్ పిక్చర్స్ , లైకా ప్రొడక్షన్స్ వంటివి ఆయన మృతి పట్ల నివాళులు అర్పిస్తున్నాయి.
Advertisement
Advertisement
ఆర్ ఎస్ శివాజీ ఎక్కువగా కమల్ హాసన్ సినిమాల్లోనే నటించాడు. 80, 90వ దశకంలో వచ్చిన చిత్రాల్లో ఈయన కమల్ హాసన్‌తో కలిసి నటించాడు. అపూర్వ సహోదరులు, మైఖెల్ మదన కామరాజు వంటి సినిమాల్లో ఆయన నటన అందరినీ మెప్పిస్తుంది. కోలీవుడ్ హాస్య నటుడిగా అందరికీ సుపరిచితులు. ఇక గార్గి సినిమాతో తెలుగులోనూ అందరినీ ఆకట్టుకున్నారు. సాయి పల్లవి తండ్రిగా ఆర్ ఎస్ శివాజీ అందరికీ గుర్తుండిపోయారు. ఇక జగదేకవీరుడు అతి లోక సుందరి సినిమాలో ..పోలీస్ క్యారక్టర్ లో తెలుగు వారికి కూడా సేపరిచితమే.
కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా కమెడియన్ రోల్స్ వేసినా కూడా రాను రాను సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు. ఈ మధ్య ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. చివరగా ఆయన నటించిన చిత్రం లక్కీ మ్యాన్. యోగి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో ఆయన కనిపించాడు. ఇది ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. ఆర్ ఎస్ శివాజీ.. ప్రముఖ నిర్మాత, నటుడు ఎం ఆర్ సంతానం కుమారుడు కాగా.. యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన శంతన భారతికి సోదరుడు అన్న సంగతి తెలిసిందే. డాక్టర్ లాంటి రీసెంట్ సినిమాల్లో తాత క్యారక్టర్ చేసి మెప్పించారు. కాని ఇప్పుడు ఇక లేరు అంటే కోలివుడ్ లో ఆయన ఫ్యాన్స్ నివాళులు అర్పిస్తున్నారు.