Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చిన హీరోలలో చిరంజీవి కూడా ఒకరు. కృషి పట్టుదలతో అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి. ఇక రాజకీయాలు అడుగుపెట్టి.. సినిమాలకు దూరమైన చిరంజీవి తిరిగి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రి ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 చిత్రం హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య మినహా సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో అపజయాన్ని చవిచూశారు. ఇలా చిరంజీవి వరస అపజయాలను చవిచూడడంతో ఓ అభిమాని తన వ్యధను వ్యక్తం చేస్తూ చిరంజీవికి ఓ లేఖ రాశారు.
Advertisement
70 ఏళ్ళకి దగ్గర అవుతున్న వయసులో కూడా తెల్లవారు జామున 3గంటల వరకు వర్క్ చేసి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 7 గంటలకి కాల్ షీట్ వుంది అంటే అరగంట ముందే షూట్ లొకేషన్ కి వచ్చే హీరో మీరు. సినిమా అన్నా… చేసే వృత్తి అన్నా అంత ప్రాణం , ప్యాషన్ మీకు. ఎప్పుడో జాతర సినిమాకి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ లో ఉన్న టాలెంట్ ని గుర్తించి 15 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ కి నటనలో మెలకువలు నేర్పమనే బాధ్యత అప్పగిస్తే.. అతను ఈ రోజున టాలీవుడ్ టాప్ హీరోలకి నట గురువు (వైజాగ్ సత్యానంద్ గారు) అయ్యారు.
మాస్టర్ మూవీ టైం లో విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కథని గుర్తు పెట్టుకొని 11ఏళ్ల తర్వాత పిలిచి దర్శక ధీరడు రాజమౌళితో మగధీర దగ్గురుండి చేపించుకొని రామ్ చరణ్ కి తిరుగులేని స్టార్ డమ్ వచ్చేలా చేసారు ఉప్పెన సినిమా ప్రివ్యూ చూసి ప్రొడ్యూసర్స్ కి ఓన్ రిలీజ్ చేసుకోమని సలహా గ్రేట్ జడ్జిమెంట్ మీది. ఇలాంటివి మీలో వున్న గొప్ప క్వాలిటీస్ వున్నాయి. అలాంటి మీరు ఎందుకు ఇలా గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి సినిమాలు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎవరి చేతుల్లో వుండదు.. కానీ స్ట్రెయిట్ సినిమా చేస్తే వచ్చే కిక్ ఇలా రీమేక్స్ లో రావు. సైరా సినిమా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రాజమౌళి గారి సపోర్ట్ లేకుండా ఇప్పుడున్న టాప్ 6 హీరోల్లో ఎవరు కూడా ఇంతవరకు క్రాస్ చేయలేకపోయారు. మొన్న సంక్రాంతి కి వచ్చిన వీరయ్య అవరేజ్ గా వున్నా కూడా.. మీ గ్రేస్ అండ్ ఎనర్జీ తో సినిమాని 200+ గ్రాస్ తో 200 డేస్ ఆడి బ్లాక్ బస్టర్ మూవీ చేసారు.
Advertisement
పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుండీ సినిమా మీద మీకున్నంత ఫ్యాషన్, ప్రేమ లేదు పబ్లిక్ కీ మంచి చేయడానికి పాలిటిక్స్ లో వున్నారు. కాబట్టి, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేస్తేనే ఉద్దేశ్యంతోనో రూపాంతరం చెందుతుంది అంటే అర్ధం వుంది. కానీ మీకెందుకు సార్ ఈ రీమేక్స్… ఇంకా మీ నుండి లక్షలాదిమంది అభిమానులు, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు కొంచెం స్టొరీ ఇంట్రెస్టింగ్ గా వుంటూ మీరు స్టెప్స్ వేస్తే కలసి స్టెప్స్ కలపడానికి, ఫైట్స్ చేస్తే విజిల్స్ వేయడానికి, డైలాగ్స్ చెప్తుంటే క్లాప్స్ కొట్టడానికి, కామెడీ చేస్తే నవ్వుకోవడానికి,సెంటి సీన్స్ చేస్తే కన్నీళ్లు టోటల్ పెట్టడానికి గా ఒక కమర్షియల్ విందు భోజనం లాంటి సినిమా చూడడానికే సిద్దంగా వున్నారనీ వాల్తేరు వీరయ్యతో నిరూపించారు. అలాంటిది ఎందుకు సార్ సరిగ్గా ఉడికి ఉడకని ఈ రిపేర్స్ చేసి మీ మార్కెట్ ని మీరే తగ్గించుకుంటున్నారు..
ఇది కూడా చదవండి:
అల్లు అర్జున్ కి రాఖీ కట్టిన ఎన్టీఆర్ భార్య.. గిప్ట్ గా ఏం ఇచ్చారంటే ?